వేసవి స్లాట్ మొదటి గా బుక్ చేసుకున్న నాని

Tuck Jagadish Bucks Trend to Confirm Deal with Amazon Prime Videoఈ ఏడాది సమ్మర్ వేడి అప్పుడే రాజుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తీర్చుకున్నా ఇంకా 50% ఆకుపెన్సీ తోనే నడుపుకోవాల్సిన పరిస్థితి… మార్చి కి గానీ పరిస్థితులు పూర్తిగా ఇదివరకు స్థాయికి చేరుకునే పరిస్థితి లేదు. దానితో చాలా సినిమాలు వేసవి విడుదలకు ప్లాన్ చేస్తున్నాయి. అయితే మొట్టమొదటిగా సమ్మర్ స్లాట్ బుక్ చేసుకుంది మాత్రం నానినే.

ADVERTISEMENT

టక్ జగదీష్ ఏప్రిల్ 16 న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగు సంవ‌త్స‌రాది అయిన ఉగాది పండగ ఏప్రిల్ 13..పండ‌గ మూడు రోజుల తరువాత టక్ జగదీష్ థియేటర్లకు వస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్లలో ఒకటి మాస్… ఇంకోటి క్లాస్ గా ఉండి ఆకట్టుకున్నాయి.

2021 లో మూడు చిత్రాలను లైన్ లో పెట్టాడు. టక్ జగదీష్ విడుదల ఇప్పుడే కంఫర్మ్ కాగా… 2021లో ఆయన రెండవ చిత్రం శ్యామ్ సింఘా రాయ్ ఆగస్టులో విడుదల కానుంది. అలాగే.. అతని మరో చిత్రం అంటే సుందరానికి ని డిసెంబర్‌లో విడుదల చేసి సంవత్సరాన్ని పూర్తి చేస్తాడు. ఈ మూడు చిత్రాలతోనూ హిట్స్ ఇవ్వడం ద్వారా హాట్రిక్ కొట్టాలని నటుడు టార్గెట్ గా పెట్టుకున్నాడు.

ADVERTISEMENT
Latest Stories