బయోపిక్ ఒకటే కానీ…పాత్రలు మాత్రం వేరే?

two biopics on jayalalithaతమిళ పురచ్చితలైగా పేరుగాంచిన అమ్మ ‘జయలలిత’ బయోపిక్ అంటూ ఎవరికీ వాళ్ళు ఒక సినిమా తీసేస్తున్నారు. అందులో ఒకరు దర్శకుడు ప్రియదర్శిని కాగా..మరొకరు కణం సినిమా దర్శకుడు విజయ్. అయితే ఒక్క మనిషికి ఇన్ని బయోపిక్స్ ఎందుకు అంటే..ఏమో అసలు ఎవరు ఏ ఉద్దేశంతో…ఏ కథ తీస్తున్నారో…ఏం చూపించాలి అని ప్రయత్నిస్తున్నారో అర్ధం కానీ పరిస్థితి.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఇదిలా ఉంటే ఒక్కో సినిమాకి ఒక దర్శకుడు అన్నట్లు..పాత్రల్లో కూడా ఒక్కో సినిమాలో జయలలిత పాత్రను, శశికళ పాత్రను ఒక్కొక్కరు పోషించడం..విజయ్ తీస్తున్న సినిమాలో ‘జయలలిత’ పాత్రలో విద్యా బాలన్ చేస్తుంది అని వినిపిస్తూ ఉండగా..ఇక ప్రియదర్శిని తెరకెక్కిస్తున్న ‘ఐరన్ లేడీ’ సినిమాలో జయలలిత పాత్రను నిత్యా మీనన్ చేస్తుంది అని వినిపిస్తుంది.

ఇక జయలలితకి ఆప్తురాలైన..శశికళ పాత్రలో సైతం ఒక్కో సినిమాలో ఒక్కొక్కరు కనిపించనున్నారు..విజయ్ సినిమాకి సాయి పల్లవి శశికళగా మారనుండగా..ఇక ప్రియదర్శిని సినిమాకు వరలక్ష్మి శరత్ కుమార్ శశికళ పాత్రలో కనిపించనుంది…

వీటన్నింటి మధ్యలో గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న జయలలిత వెబ్ సిరీస్ లో జయలలితగా… ‘రమ్య కృష్ణ’ కనిపించనుంది..అయితే శశికళ పాత్ర విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు…మొత్తంగా అదీ అమ్మ బయోపిక్స్ పై..ఇంటరెస్టింగ్ స్టోరీ.

ADVERTISEMENT
Latest Stories