ఇద్దరు లెంజెండ్సే…కానీ, అతనలా.. ఇతనిలా..!

Two Legends: Virat Kohli and Rohit Sharma

గతేడాది జరిగిన టి-20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న కొద్ది సమయానికే భారత టి-20 జట్టుకు రెండు స్థంబాల వంటి దిగ్గజాలైన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ పొట్టి ఫార్మటు కు ఇక సెలవంటూ తమ రిటైర్మెంట్ ను ప్రకటించారు. ఇద్దరు తల ఒక 4000 + పరుగులను సాధించి, ఆ ఫార్మటు లో కూడా లెజండరీ లుగా నిలిచారు ఈ సీనియర్ ఆటగాళ్లు.

అయితే, వారు ఆ ఫార్మటు కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత తాము ఆడుతున్న తొలి ఐపీఎల్ సీజన్ ఇదే అవ్వటంతో ఈ ఇద్దరి పై అంచనాలు భారీ గానే ఉన్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ, వన్-డే మ్యాచ్లలో ఆడుతున్న ఆట శైలి ఈ పొట్టి ఫార్మటు కు అనుకూలించడంతో అతని పై అభిమానులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ADVERTISEMENT

కానీ, సీజన్ ప్రారంభమయ్యాక సీన్ రివర్స్ అయ్యింది. ఈ ఇద్దరు బడా బ్యాటర్లు ఓపెనర్లు గానే మైదానంలో అడుగుపెడుతున్నప్పటికీ విరాట్ కోహ్లీ ఆ రోల్ లో అద్భుతంగా రాణిస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఇటు రోహిత్ విషయానికొస్తే, ఈ సీజన్లో ఇప్పటికే 5 మ్యాచ్లు ఆడిన రోహిత్ కేవలం 56 పరుగులు మాత్రమే చేసి, 130 సగటు తో, కేవలం 11 యావరేజ్ తో ఉన్నాడు.

మరి అదే స్పాట్ లో బ్యాటింగ్ కు వస్తున్న కింగ్ కోహ్లీ మాత్రం తన జట్టుకు అద్భుతమైన ఆరంభాలు ఇవ్వటమే కాదు, క్రీజు లో నిలబడిపోయి, ఇన్నింగ్స్ ను యాంకర్ చేస్తూ, చివరి వరుకు క్రీజు లో ఉండి మ్యాచ్ ను ఫినిష్ చేస్తున్నాడు. ఈ సీజన్ లో 6 మ్యాచ్లలోనే 248 పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ రేస్ లో 4 వ స్థానంలో ఉన్నారు.

మరి ఈ ఇద్దరు టి-20 లెజెండ్స్ ఒకేసారి పొట్టి ఫార్మటు నుండి తప్పుకుని, ఈ ఐపీఎల్ లో విభిన్నమైన శైలి లో ఆడుతున్నారు. రోహిత్ శర్మ ఈ ఫామ్ లేమి నుండి బయటకు వచ్చి, కష్టాల్లో ఉన్న ముంబై జట్టుకు ఆంజనేయ సాయం చేయాలంటూ ముంబై ప్రేక్షకులు కోరుకుంటూ ఉండగా, కింగ్ ఇలానే తన బ్యాటింగ్ ఫామ్ ను కొనసాగిస్తూ బెంగళూరు జట్టు 18 ఏళ్ళ ఐపీఎల్ కప్పు కళను నెరవేర్చాలంటూ ఆ జట్టు అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories