మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రైలర్స్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. వరుణ్ తేజ్ గెట్ అప్, మొట్టమొదటి సారిగా మాస్ క్యారెక్టర్ చెయ్యడంతో మెగా అభిమానులు ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుణ్ తేజ్ ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదే అతని కేరీర్ లో మొదటి సారి అటువంటి రోల్ చెయ్యడం. ట్రేడ్ లో కూడా ఈ సినిమాకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా వాల్మీకి చిత్రం సాటిలైట్ హక్కులు, డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్, స్టార్ మా 10 కోట్లకు సినిమాకు సాటిలైట్ హక్కులు, డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. డిజిటిల్ రైట్స్ స్టార్ మా డిజిటల్ పార్టనర్ హాట్ స్టార్ కు వెళ్లే అవకాశం ఉంది. వాల్మీకికి ఒక్క రోజు ముందుగా సూర్య బందోబస్త్ సినిమా విడుదల అవుతుంది. ఆ సినిమా మీద పెద్దగా హైప్ లేకపోవడంతో వాల్మీకికి దాదాపుగా లైన్ క్లియర్ అనే చెప్పుకోవాలి.
ఇప్పటికే థియేటర్స్ లో ఉన్న నాని గ్యాంగ్ లీడర్ సినిమా అప్పటివరకు నిలబడే అవకాశం కనిపించడం లేదు. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం పై వరుణ్ తేజ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. గత నాలుగు చిత్రాలలో మూడు హిట్లు ఇచ్చి మంచి ఊపు మీద ఉన్నాడు వరుణ్ తేజ్. 14రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న వాల్మీకి చిత్రానికి మిక్కీ జె మేయర్ చిత్రానికి సంగీతం అందించాడు. గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ కు ఆ రేంజ్ హిట్ లేదు. దానితో ఈ సినిమా మీద అతను భారీగా ఆశలు పెట్టుకున్నాడు.





