వంగవీటి’లో ఉన్న ఏకైక మహిళ ‘పాత్ర’

vangaveeti ratnakumari only lady character in RGV Vangaveetiరాంగోపాల్ వర్మ లేటెస్ట్ సెన్సేషన్ “వంగవీటి” సినిమా కోసం ఇటీవల బెజవాడ విచ్చేసి పలువురితో భేటీ అయ్యి, సమాచారం సేకరించిన విషయం తెలిసిందే. అయితే వంగవీటి మోహన రంగా భార్య రత్నకుమారి సమయం కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆమె ఇవ్వకపోవడంతో వర్మ ఆమెను కలవకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అయితే రియల్ రత్నకుమారిని కలవలేకపోయినా, రీల్ రత్నకుమారిని మాత్రం వెంటనే కలవడంలో సక్సెస్ అయ్యారు వర్మ.

ప్రముఖ బెంగాలీ నటి నైనా గంగూలీని వంగవీటి రత్నకుమారి పాత్రకు ఎంపిక చేసినట్లుగా ఖరారయ్యింది. మరో విశేషమేమిటంటే… ఈ ‘వంగవీటి’ సినిమాలో ఉన్న ఏకైక మహిళ పాత్ర రత్నకుమారిదే కావడం. ఈ సమాచారాన్ని ‘వంగవీటి’ సినిమాకు పాటలు రచించిన సిరాశ్రీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories