యువ హీరోకు అనారోగ్యం

varun sandesh hospitalised before engagementతెలుగులో పలు చిత్రాల్లో హీరోగా నటించిన వరుణ్‌ సందేశ్‌కి ఈనెల 7న తాను ప్రేమించిన అమ్మాయి వితిక షేరుతో నిశ్చితార్థం జరుగబోతుంది అనే వార్తలు తాజాగా మీడియాలో వచ్చిన విషయం తెల్సిందే. నిశ్చితార్థ సమయం దగ్గర పడుతున్న సమయంలో వరుణ్‌ సందేశ్‌ హాస్పిటల్‌ పాలయ్యాడు. ఈయనకు తీవ్రమైన టైఫాయిడ్‌ మరియు డెంగ్యూ ఫీవర్‌లు రావడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ హాస్పిటల్‌లో జాయిన్‌ చేయించారు.

ప్రస్తుతం వరుణ్‌ సందేశ్‌ ఆరోగ్యం కుదుట పడుతుందని, నిశ్చితార్థ సమయం వరకు వరుణ్‌ లేచి తిరగడం ఖాయం అని డాకర్టు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు మరియు ఆయన సన్నిహితులు మాత్రం ఆదోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా నుండి ఇటీవలే వచ్చిన వరుణ్‌ సందేశ్‌కు ఒక్కసారిగా వాతావరణం చేంజ్‌ అవ్వడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తి ఉంటాయని ఆయన కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈనెల 7న జూబ్లీ హిల్స్‌ క్లబ్‌లో వరుణ్‌ సందేశ్‌, వితిక షేరుల నిశ్చితార్థంను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాల వారు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీ నుండి అతిరధ మహారథలు పాల్గొనబోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories