“గెట్ రెడీ ఫర్ ది మాసివ్ చిరు 150” అంటూ తన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఫోటోకు ఫోజు ఇచ్చాడు వరుణ్ తేజ్. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఫోటోతో ‘150’ సంఖ్యను సింబాలిక్ గా చూపుతున్న ఫోటోను ట్వీట్ చేసాడు వరుణ్. మెగా అభిమానులు ఎంతో కాలం నుండి వేచిచూస్తున్న ఈ సినిమాపై ట్వీట్ కావడంతో వరుణ్ ఫోటోను షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే, 150వ సినిమా ప్రారంభోత్సవ ముహూర్తం ఈ నెల 29వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. తమిళ చిత్రం ‘కత్తి’ రీమేక్ లో నటించేందుకు చిరంజీవి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించనుండగా, మెగాస్టార్ తనయుడు, యువ హీరో రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ‘కత్తిలాంటోడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నా, ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు.



