రాజమౌళి డేట్ ని ఫిక్స్ చేసుకున్న వరుణ్ తేజ్

Sai manjrekar to romance varun tejసినిమా సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటూ పోతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్న ఈ యంగ్ హీరో బాక్సింగ్ నేప‌థ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. కొత్త కుర్రాడు కిర‌ణ్ కొర్ర‌పాటి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా కోసం అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ దగ్గర శిక్షణ తీసుకున్నాడు వరుణ్ తేజ్.

ఈ రోజు ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో మొదలుపెట్టారు. మూడు వారాల వరకు అక్కడ షూటింగ్ జరగనుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాను జులై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ఎస్ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఇదే రోజున విడుదలకు ప్లాన్ చేశారు.

ADVERTISEMENT

అయితే ఆ సినిమా వాయిదా పడటంతో ఆ డేట్ ని వరుణ్ బుక్ చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, అల్లు బాబీ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. వరుణ్ నటించబోతున్న పదో సినిమా ఇది. గద్దలకొండ గణేష్ సినిమాలో ఊర మాస్‌గా కనిపించిన వరుణ్ ఇప్పుడు బాక్సర్‌గా ఎలా ఉంటారో చూడాలి.

ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సినిమాకు సంగీతం అందిస్తారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ తండ్రిపాత్రలో మాధవన్ నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించనుంది. సినిమా సినిమాకు విశిష్టత చూపిస్తూ వరుణ్ తేజ్ ముందుకు పోవడంతో ఆయన ఫ్యాన్ బేస్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories