మెగా హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో ఉన్న హీరోలందరిలో కన్నా కూడా మెగా హీరోలకు అత్యధిక ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి మెగా హీరోలకు కూడా ఇతర హీరోలు అంటే అభిమానం ఉంటుంది. రామ్ చరణ్‌కు బాలీవుడ్ హీరోలు అంటే అభిమానం. ఇక మెగా యువ హీరో వరుణ్ తేజ్‌కు టాలీవుడ్‌లో ప్రభాస్ అంటే పిచ్చి అభిమానమట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు.
తాజాగా వరుణ్ తేజ్‌ను మీ అభిమాన నటుడు ఎవరు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చిరంజీవి అన్నాడు. యువ హీరోల్లో రామ్ చరణ్ అన్న అంటే ఇష్టం. చరణ్ అన్న డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం అని, ఆయన డాన్స్‌లను చూసి నేను నేర్చుకున్నా అన్నాడు. ఇక మెగా హీరోల్లో కాకుండా వేరే హీరోల్లో అయితే తనకు ప్రభాస్ అంటే చాలా అభిమానం అని, చాలా కాలంగా ప్రభాస్‌ను తాను అభిమానిస్తున్నాను అంటున్నాడు. ప్రభాస్ లుక్, సినిమా కోసం ఆయన పడే కష్టం తనకు నచ్చుతుందని వరుణ్ అన్నాడు. ఒక పెద్ద హీరో తన అభిమాన నటుడు మరో హీరో అని చెప్పడం చాలా అరుదు. వరుణ్ మాత్రం ఎలాంటి బేషజాలు లేకుండా తన మనస్సులో మాటను చెప్పి అందరి అభినందనలు అందుకుంటున్నాడు.





