సినిమా ఎంత పెద్ద హిట్ అయినా…కష్టమేనా?

Varun Tej - Venkatesh -F2 - Fun and Frustration యువ హీరోల్లో మంచి గ్లామర్ ఉండి వరుస హిట్స్ ఉండి కూడా…పెద్దగా మార్కెట్ ఎక్కని హీరోల జాబితాలోకి చేరిపోయాడు మన యువ హీరో వరుణ్ తేజ్. వరుసగా ఫిదా..తోలి ప్రేమ మంచి హిట్స్ ఇచ్చాయి…వరుణ్ మార్కెట్ అమాంతంగా పెరిగిపోతుంది అని సంబరపడ్డారు ఆయన ఫాన్స్…మరియు ట్రేడ్, కట్ చేస్తే అలాంటి అవకాశం రాలేదు.

వరుణ్ తాజా సినిమా “అంతరిక్షం”కి బయ్యర్స్ కరువయ్యారు…నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేసుకుని చేతులు కాల్చుకున్నారు…పెట్టిన పెట్టుబడిలో సగం కూడా తిరిగి రాకపోవడంతో లాస్ లోకి వెళ్లిపోయారు నిర్మాతలు. సరే అయిపోయింది ఎదో అయిపోయిందిలే..సంక్రాతి బరిలో నిలిచే ఎఫ్-2 మంచి ఎంటర్టైన్మెంట్ మోడ్ లో ఉండి..హిట్ గ్యారంటీ అన్న మాట బలంగా వినిపడుతుంది అని అనుకున్నా..ఈ సినిమా వల్ల వరుణ్ కి పెద్దగా కలసి వచ్చేది ఏమి లేదు.

ADVERTISEMENT

ఎందుకంటే..ఈ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం వెంకీ..దిల్ రాజు..దర్శకుడు అనిల్ రావి పూడి ఖాతాలోకి పోతుంది..వారి ముందు వరుణ్ నిలబడటం కష్టమే..ఈ లెక్కన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా వరుణ్ కి పెద్దగా కలసి వచ్చేది ఏమి ఉండదు అని చెప్పక తప్పదు.

మరి ఇప్పటివరకూ మాస్ సినిమాలపై పెద్దగా ఆలోచన చెయ్యని వరుణ్ ఈ అనుభవాలతో అటు అలోచించి కెరీర్ ను సరికొత్తగా మలచుకుంటాడేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories