ఇది కిడ్నాపేగా? నేడు నికోలస్… రేపు ఎవరో?

Venezuela President Nicolas Maduro In US Federal Custody

ఏ దేశంలోనైన కిడ్నాపులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఓ దేశాధ్యక్షుడుని, అయన భార్యని మరో దేశం కిడ్నాప్ చేయడమే దిగ్బ్రాంతి కలిగిస్తుంది.

అమెరికన్ దళాలు వెనిజులా రాజధాని కాకరస్‌పై శనివారం తెల్లవారుజామున దాడి చేసి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, అయన సతీమణిని బందీలుగా పట్టుకుపోయారు. దీనిని కిడ్నాపనే అనాలి కదా?

ADVERTISEMENT

వారిని బందీలుగా అమెరికాకు పట్టుకు వచ్చిన తర్వాత, డోనాల్డ్ ట్రంప్‌ ఫ్లోరిడాలో మీడియాతో మాట్లాడుతూ, “అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయలనుకునే వారికి ఇదో గట్టి హెచ్చరిక. అవసరమైతే వెనిజులా మళ్ళీ మరింత భీకర దాడులు చేస్తాము,” అని హెచ్చరించారు.

వెనిజులా సార్వభౌమత్వం తమకు పూచిక పుల్లతో సమానమన్నట్లు ఆ దేశ రాజధానిపై దాడి చేసి ఆ డేశాధ్యక్షుడుని అధ్యక్ష భవనంలో నుంచి ఎత్తుకువచ్చేసిన ట్రంప్‌, తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగితే సహించబోమని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?

నికోలస్ మదురో దుష్టుడు, దుర్మార్గుడు, అవినీతిపరుడు అయ్యుండవచ్చు. ఆయన పాలనని దేశ ప్రజలు వ్యతిరేకిస్తుండవచ్చు. కానీ ఆయన ఆ దేశానికి అధ్యక్షుడు. ఆయనని కిడ్నాప్ చేసి, చేతికి బేడీలు వేసి, కళ్ళకు గంతలు కట్టి అమెరికాకు తీసుకురావడం ట్రంప్‌ జాత్యాహంకారానికి నిదర్శనంగా భావించవచ్చు.

ఇకపై ఆ దేశాన్ని తమ అధీనంలో ఉంచుకుంటామని ట్రంప్‌ చెప్పడం ఆయన దురహంకారానికి మరో నిదర్శనమే.

వెనిజులాలో అస్తవ్యస్త పరిస్థితులున్నాయి కనుకనే ఇలా చేస్తున్నామని ట్రంప్‌ తన దౌర్జన్యాన్ని, దురాక్రమణని సమర్ధించుకున్నారు.

కానీ అయన గతంలో అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆఫ్గనిస్తాన్ లేదా మరో దేశం కోసం మా సైనికుల ప్రాణాలు బలిచేయాల్సిన అవసరం లేదన్నారు.

అమెరికన్ల కష్టార్జితానని ఇతర దేశాల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం లేదంటూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమ సైనిక దళాలను ఉపసంహరించుకున్నారు కదా?ఎందుకు?అంటే అక్కడ చమురు, ఖనిజ నిక్షేపాలు లేవు కనుక!

కానీ వెనిజులాలో అవి పుష్కలంగా ఉన్నాయి కనుక ఈ కుంటి సాకుతో ఆ దేశాన్ని తమ అధీనంలోకి తీసుకొని దోచుకునేందుకు సిద్దపడుతున్నారు. కర్ర ఉన్నవాడిదే బర్రె అంటే ఇదే కదా?

ట్రంప్‌ ఇంత దురహంకారంతో, దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నా భారత్‌తో సహా పలు దేశాలు ఖండించడం లేదు. ఎందుకంటే అమెరికాతో వాణిజ్యం, ఐటి కంపెనీల లావాదేవీలు, ఉద్యోగాలు, హెచ్-1బీ వీసాలు వంటి అవసరాలున్నాయి కనుక. అంటే ట్రంప్‌ ఈ ఆక్రమణకు ముందే ప్లాన్ చేసుకున్నారన్న మాట!

వెనిజులా అధ్యక్షుడుని ట్రంప్‌ కిడ్నాప్ చేయించి ఎత్తుకుపోతే మనమెందుకు బాధపడాలి? అనుకునేవారికి ఓ చిన్న ప్రశ్న రేపు ఢిల్లీపై అమెరికా లేదా మరో దేశం దాడి చేసి ఇలాగే మన ప్రధాని మోడీ లేదా రాష్ట్రపతిని కిడ్నాప్ చేసి ఎత్తుకుపోతే ఓకేనా?

ADVERTISEMENT
Latest Stories