వావ్… క్యా డైలాగ్ మారా… వెంకయ్యా జీ..!

venkaiah naidu speech at CII summitమనుషులు రెండు రకాలు. ఒకళ్ళు మాటలు చెప్పేవారు, మరొకరు చేతల్లో చూపించేవారు. ఏపీ విషయంలో కేంద్రం చేతల తీరు ఎలా ఉన్నా మాటల వరకు డోఖా లేదన్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఏపీ సిఎం చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అదిరిపోయాయ్!

“తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదు ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ఉన్నారని” అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఈ స్థాయికి రావడానికి కారణమైన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో ఉన్నాడన్న విషయం మరువొద్దని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత తనను కలిసిన సుమారు 40 దేశాల బ్రాండ్ అంబాసిడర్లు చర్చల తర్వాత, చంద్రబాబు పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారని ఆయన వెల్లడించారు. విశాఖపట్టణంలో జరుగుతున్న సీఐఐ సదస్సులో పాల్గొన్న సందర్భంగా వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలివి.

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వాగ్ధాటికి, భోళాతనానికి అదే వేదికపై ఉన్న ఏపీ సిఎం చంద్రబాబు నవ్వేశారు. సాధారణంగా గుక్కతిప్పుకోకుండా మాట్లాడడంలో వెంకయ్యనాయుడును మించిన రాజకీయ నాయకుడు లేడనేది అక్షర సత్యం. తన వాగ్ధాటితో ఎంతటివారినైనా మంత్రముగ్ధులను చేయడంలో వెంకయ్యనాయుడు స్పెషలిస్టు. తాజాగా ఆయన మరోసారి గతంలోకెళ్లిపోయారు. ఇక్కడి బీచ్ పై మాట్లాడేప్పుడు ఆయన అలాంటి భావం కనబరిచారు. ఈ సందర్భంగా ముసిముసి నవ్వులు నవ్విన చంద్రబాబు, ఇక్కడే నేను జైలుకెళ్లానని ఆయన చెప్పగానే గట్టిగానే నవ్వేశారు.

ADVERTISEMENT
Latest Stories