ఫ్రెష్ లుక్ తో ఫ్యాన్స్ ఫిదా!

Venkatesh-Latest-Stillసీనియర్ హీరోలలో అందరితో కలిసిపోతు మల్టీస్టారర్ సినిమాలు చేస్తోన్న హీరో విక్టరీ వెంకటేష్. ఓ పక్కన సింగిల్ గా కొన్ని చిత్రాలు చేస్తూనే, మరో పక్కన జూనియర్ హీరోస్ తో కలిసిపోయి ప్రేక్షకులకు మల్టీస్టారర్ సినిమాలు అందిస్తున్న వెంకీ, తాజాగా మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. ఇందులో ఒకటి వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 2’ మల్టీస్టారర్ కాగా, నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’గా సందడి చేయబోతున్నాడు.

ఇలా రెండు మల్టీస్టారర్ సినిమాలతో పాటు డిసెంబర్ లో సింగిల్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నారని న్యూస్ వచ్చింది. అయితే ఇది అధికారికంగా ధృవీకృతం కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మొన్నటివరకు ఐపీఎల్ హంగామాలో మునిగి తేలిన వెంకటేష్, ప్రస్తుతం ఫ్రెష్ లుక్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు. క్లీన్ షేవింగ్ తో యువ హీరోలతో పోటీగా తాను రెడీ అన్నట్లుగా హ్యాండ్సం లుక్ లో అదరగొడుతున్నాడు విక్టరీ.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories