‘గురు’ సినిమాకు మైక్ టైసన్ సలహాలు!

Venkatesh movie Guru - Mike Tysonమరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విక్టరీ వెంకటేష్ “గురు” సినిమా, ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీంతో ‘గురు’ గురించి విక్టరీ చెప్తూ… ఈ సినిమా మూడేళ్ల క్రితమే తన వద్దకు వచ్చిందని, అయితే అపుడు తాను అనారోగ్యంతో ఉండడంతో, ఈ సినిమాను చేయలేక అంగీకరించలేదని, కానీ ఈ సినిమా దర్శకురాలు తెలుగు మహిళే కావడంతో షూటింగ్ చాలా సులువుగా గడిచిపోయిందని, కానీ పాత్ర కోసం చాలా శ్రమపడ్డానని, ఆరు నెలల పాటు బాక్సింగ్ నేర్చుకున్నానని కూడా ‘గురు’ అనుభూతులను పంచుకున్నారు.

పాత్ర పోషించే ముందు ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ను కలిశానని… ఆ సమయంలో టైసన్ చాలా విలువైన సలహాలు ఇచ్చాడని వెంకీ తెలిపారు. ప్రధానంగా ఆటలో కోచ్ ప్రభావం ఎంత మేలు చేసిందో వివరించాడని, తన కోచ్ తో విభేదాలు రావడంతో తన నుంచి కోచ్ దూరంగా వెళ్లాడని, దీంతోనే తాను ఓటమి పాలయ్యానని చెప్పిన మాటలు బాగా నాటుకుపోయాయని అన్నాడు. కోచ్ లేకపోతే మనం ఏం చేస్తున్నామో తెలియదని, చేసే ప్రతీదీ సరిగ్గానే అనిపిస్తుందని టైసన్ వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ… కోచ్ లేకుండా ఏదైనా ఆడడం అసాధ్యమని వెంకీ ధృవీకరించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories