మెగా హీరోకి షాక్ ఇచ్చిన వెంకటేష్

Venkatesh asuran remake shootin anantapurసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అరడజను ప్లాపుల తరువాత చిత్రలహరి లాంటి యావేరేజ్ సాధించారు. ఆ తరువాత ప్రతి రోజూ పండగే తో పెద్ద హిట్ కొట్టాడు. చాలా కాలం తరువాత వచ్చిన హిట్ కావడంతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు తేజ్. తన తరువాతి సినిమా ‘సోలో బ్రతుకే సో బెటరు’ మే 1న విడుదల చెయ్యనున్నట్టు ప్రకటించేశారు.

మే 1న మే డే హాలిడే కావడంతో బాగా కలిసి వస్తుందని తేజ్ ఆలోచన. అయితే ఇప్పుడు వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమాకూడా అదే రోజు విడుదల చెయ్యనున్నట్టు సమాచారం. దీనితో ఖంగుతిన్నాడు ఈ మెగా హీరో. చూడాలి ఏ జరగబోతుంది అనేది. నారప్ప షూటింగ్ ఈరోజు హిందూపురంలో మొదలయ్యింది. మూడు వారల పాటు అక్కడే షూటింగ్ ఉంటుంది.

ADVERTISEMENT

తమిళ హీరో ధనుష్ నటించిన సంచలన మూవీ ‘అసురన్’ను తెలుగులో రీమేక్ ఇది. సినిమాలో వెంకటేష్ గెట్ అప్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ‘బ్రహ్మోత్సవం’ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ రీమేక్‌కి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

అయితే ఈ పోస్టర్లతో చాలా వరకూ అనుమానాలు నివృత్తి అయినట్టే. వెంక‌టేశ్ స‌ర‌స‌న ప్రియ‌మ‌ణి నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌లో సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి తిరిగొచ్చిన మణి శర్మ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories