‘వెంకీ మామ’…ఏమయ్యిందో?

Venkatesh---Naga-Chaitanya-Movie-Updatesదగ్గుపాటి కుటుంభం…అక్కినేని కుటుంభం ఈ ఇరు కుటుంభాల మధ్య ఉన్న బాంధవ్యం, వారికి ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. అయితే వెంకీ…అక్కినేని చైతూ కలసి వెంకీ మామ అన్న మల్టీ స్టారర్ చెయ్యనున్నారు అని ఇప్పటికీ టాలీవుడ్ లో బజ్ బలంగా వినిపించింది. అదిగో షూటింగ్..ఇదిగో షూటింగ్ అంటూ నవంబర్ నుంచి డిసెంబర్ వరకూ అయితే వచ్చేశారు కానీ..సినిమా మాత్రం పట్టాలు ఎక్కలేదు.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఈ సినిమా కోసం దర్శకుడు చెప్పిన కధలో చాలా మార్పులే చేశాడు కానీ చివరకు ఆయన చేసిన ఏ మార్పు నిర్మాత సురేష్ బాబుకి నచ్చలేదు. మరో పక్క వెంకీ, చైతూ ఇద్దరూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని చూస్తున్నారు. ఇక ఈ ఫ్యామిలీ మల్టీ స్టారర్ ను దర్శకుడు కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ, అదే మన గబ్బర్ సింగ్-2 దర్శకుడు తెరకెక్కించనున్నాడు అని అందరికీ తెలిసిందే.

ఇదిలా ఉంటే మరో పక్క అక్కినేని, వెంకీ అభిమానులు మాత్రం ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా స్క్రిప్ట్ ఎప్పుడు ఫైనలైజ్ అవుతుందో…వెంకీ-చైతూ ఎప్పుడెప్పుడు ఒకే స్క్రీన్ పై కనిపిస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories