ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 సినిమాను తన హిట్ ఖాతాలో వేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఆ వెంటనే మేనల్లుడు చైతూతో కలిసి వెంకీ మామ సినిమా స్టార్ట్ చేసారు. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. వెంకీ మామ షూటింగ్ ఒక పాట తప్ప అంతా పూర్తి అయ్యింది.
మరోవైపు వెంకటేష్ మరో రెండు ప్రాజెక్టులు సైన్ చేసినట్టు సమాచారం. ఇందులో ఒకటి త్రినాద్ రావుతో సినిమా కాగా మరొక సినిమా తరుణ్ భాస్కర్ తో. పెళ్లి చూపులు సినిమా తో పెద్ద హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్ తాజాగా ఆయన వెంకటేష్ కి ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కధ చెప్పాడట.
ఆ కధ వెంకటేష్ కి బాగా నచ్చిందని వెంటనే ఒకే చేసేశాడని అంటున్నారు. ఈ సినిమాలో సింహ భాగం షూటింగ్ హైదరబాద్ మలక్ పేటలో ఉన్న హైదరాబాద్ రేస్ క్లబ్ లో ఉండనుందని అంటున్నారు. వెంకటేష్ అల్లుడి తాత గారు, సురేందర్ రెడ్డి హైదరాబాద్ రేస్ క్లబ్ కు ఛైర్మన్ గా ఉండటం విశేషం.
వీలైనంత త్వరగా సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి షూటింగ్ ని స్టార్ట్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. వెంకటేష్ అన్న, సీనియర్ నిర్మాత డి.సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నారు. ఈ సినిమా కాకుండా వెంకటేష్ కు సినిమా చూపిస్తా మావ ఫేమ్ త్రినాథ రావు నక్కిన తో కూడా మరో ప్రాజెక్టు





