యాగంటి సెంటిమెంట్ వెంకీమామకు కలసివచ్చేనా?

Venky mama shooting in yagantiఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2 సినిమాను తన హిట్ ఖాతాలో వేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఆ వెంటనే మేనల్లుడు చైతూతో కలిసి వెంకీ మామ సినిమా స్టార్ట్ చేసారు. ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. వెంకీ మామ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ వారంలో చిత్రబృందం కర్నూల్ లోని యాగంటి వెళ్లి అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

ADVERTISEMENT

ఇది లక్కీ సెంటిమెంట్ గా భావిస్తున్నారు వెంకటేష్ అభిమానులు. గతంలో వెంకటేష్ నటించిన జయం మనదేరా, రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలు కూడా యాగంటిలో కొంత భాగం షూట్ చేశారు. ఆ రెండు సినిమాలు అప్పట్లో పెద్ద హిట్ కావడంతో అదే సెంటిమెంట్ ఇప్పుడు కూడా వర్క్ అవుట్ అవుతుందని దగ్గుబాటి అభిమానులు సంబరపడుతున్నారు.

ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తుండగా… నాగ చైతన్యకు జోడిగా రాశీ ఖన్నా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డి.సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘జై లవ కుశ’ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. తన మొదటి సినిమా పవర్ తరువాత సర్దార్ గబ్బర్ సింగ్ వంటి డిజాస్టర్ సినిమా తీశాడు బాబీ.

ఆ తరువాత వచ్చిన జై లవకుశ కూడా యావరేజ్ సినిమానే. దీనితో ఇంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. మామ అల్లుళ్ళు వెంకటేష్ నాగ చైతన్య ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో కలిసి ఒక సినిమా చెయ్యలేదు. చైతన్య ప్రేమమ్ సినిమాలో మాత్రం చిన్న పాత్రలో మెరిశారు. దానితో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories