మహేష్, బన్నీ ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి సురేష్ బాబు తెలివైన ప్లాన్ వేశారు

If-Only-Suresh-Babu-had-Courage-like--Gopichandఅల్లు అర్జున్, మహేష్ బాబు. వెంకటేష్ – నాగచైతన్యల వెంకీ మామ సంక్రాంతికి వస్తుందనే వార్తలు వస్తుండడంతో అల వైకుంఠపురములో…, సరిలేరు నీకెవ్వరు నిర్మాతలలో గుబులు రేపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో సురేష్ బాబు కింద చెప్పుకోదగిన స్థాయిలోనే థియేటర్లు ఉన్నాయి.ఇప్పుడు వెంకీమామ సినిమా కోసం వాటిని బ్లాక్ చెయ్యడంతో రెండు సినిమాలకు నష్టమే.

ఇప్పటికే ఈ విషయం సురేష్ బాబు తన ఆధ్వర్యంలోని థియేటర్ల మేనేజర్లకు సంక్రాంతికి ఎటువంటి సినిమాల అగ్రీమెంట్లు చేసుకోవద్దని చెప్పారట. మొదట మన సినిమాకే ప్రిఫరెన్స్ అని చెప్పారట. దీనితో మహేష్, బన్నీ ఇద్దరికీ టెన్షన్ మొదలయ్యింది. అయితే వెంకీ మామ రిలీజ్ డేట్ ఆఫిషల్ గా ప్రకటించకపోవడంతో ఇరు సినిమాల నిర్మాతలు సురేష్ బాబు మీద రిలీజ్ డేట్ మార్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.

ADVERTISEMENT

ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి సురేష్ బాబు ఒక కొత్త ప్లాన్ వేశారు. వెంకీ మామ సినిమాకు గ్రాఫిక్స్ బాగా అవసరం పడ్డాయి. ఇప్పటికే ఆ వర్క్ పూర్తయింది. కానీ వచ్చిన గ్రాఫిక్స్ వర్క్ నిర్మాత సురేష్ బాబుకు అస్సలు నచ్చలేదని దానితో రీ-వర్కు చేస్తున్నారని దాని వల్ల వెంకీ మామ విడుదల సంక్రాంతికి గానీ విడుదల చెయ్యలేం అని ఒక లీక్ ఇచ్చారు.

ఈ లీకు ద్వారా సురేష్ బాబు మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఎవరైనా మీ సినిమా నవంబర్ లో రిలీజ్ చెయ్యండి, లేదా క్రిస్మస్ కు విడుదల చెయ్యండి అంటే లేదండి మా సినిమా గ్రాఫిక్స్ వర్క్ అవ్వలేదని చెప్పి తప్పించుకుంటారు. మొత్తానికి సురేష్ బాబు తన ఎక్స్పీరియన్స్ చూపించారని చెప్పుకోవచ్చు. దీనితో సంక్రాంతి సస్పెన్స్ కొనసాగబోతుంది.

ADVERTISEMENT
Latest Stories