నిజ జీవితంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వారే నిజమైన హీరోలు. వెండి తెరపై వందల మందిని ఒంటి చేత్తో కాపాడే హీరోలు నిజ జీవితంలోకి వచ్చే సరికి జీరోు అవుతున్నారు. కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే హీరోలు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు చేసే సాయం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చిన్న సాయంకు భారీగా పబ్లిసిటీని సైతం వీరు కావాలనుకుంటారు. కాని హీరోల్లో నిజమైన హీరోలుగా తమిళ స్టార్ హీరో విజయ్ మరియు కొరియోగ్రఫర్, దర్శకుడు అయిన రాఘవ లారెన్స్‌లు నిలుస్తున్నారు.
గత కొన్ని రోజులుగా తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు చెన్నై నగరం అంతా కూడా అతలా కుతలం అయ్యింది. దాంతో తమకు కళా జన్మను ఇచ్చిన చెన్నైను ఆదుకుంటాం అంటూ పలువురు స్టార్స్ ముందుకు వచ్చారు. అయితే వీరు ఇచ్చిన లక్షల సాయం ఏ మూలకు సరిపోదు. వారు సంపాదిస్తున్న దానికి ఇచ్చిన సాయంకు ఏమాత్రం పొంతన లేదు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా తమ సాయంతో చిన్న వారు అయ్యారు. తమిళ స్టార్ హీరో విజయ్ మాత్రం ఏకంగా అయిదు కోట్ల సాయంను అందించి తన మానవత్వంను చాటుకున్నాడు. అలాగే రాఘవ లారెన్స్ సైతం కోటి రూపాయల సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. దాంతో తమిళ జనాలతో పాటు అందరు కూడా వీరిద్దరికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.





