రౌడీబాయ్ విజయ్ దేవర కొండను చూస్తుంటే ఒక్క ఓటమి జీవితానికి ఎన్నో నేర్పిస్తుంది అనేది ముమ్మాటికీ సత్యమే అనిపిస్తుంది. లైగర్ మూవీ విడుదల సమయంలో కొంచెం ఓవర్ కాంఫిడెన్స్ కు వెళ్లిన విజయ్ ఆ మూవీ ఇచ్చిన రిజల్ట్ తో వాస్తవిక ప్రపంచంలోకి వచ్చారనిపిస్తుంది.
అప్పటివరకు అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ లవర్ బాయ్ ఇమేజే చట్రంలో కూరుకుపోయిన విజయ్ పూరి తో తీసిన లైగర్ మూవీ తో మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవాలి అని ఆశపడ్డారు. అయితే ఆ మూవీ తో విజయ్ కోరుకున్నట్టు మాస్ ఇమేజ్ కాదు కదా ఉన్న ఇమేజ్ కూడా దూరమయిందనే చెప్పాలి.
పెళ్లి చూపులు..గీతగోవిందం..ఖుషి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అదే ఫార్మాట్ తో ఫ్యామిలీ స్టార్ గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఐరనే వంచాలా ఏంటి….అంటూ వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దింపేస్తా అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ తన వైపుకి తిప్పుకున్నారు.
ఫ్యామిలీ స్టార్ మూవీ నుండి విడుదలైన గ్లిమ్స్, టీజర్ రెండు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా ఉండడంతో ఈసారి విజయ్ ఖాతాలో మరో హిట్ ఖాయంగా కనపడుతుంది. విజయ్ సరసన మృణాల్ ఠాగూర్ హీరోహిన్ గా నటిస్తున్న ఈ మూవీని గీతగోవిందం దర్శకుడు పరుశరామ్ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా గోపి సుందర్ పనిచేస్తున్నారు.
ఈ రోజు ఫ్యామిలీ స్టార్ నుండి కళ్యాణి వచ్చా..వచ్చా…అంటూ సాగే ఒక వెడ్డింగ్ సాంగ్ ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఏప్రిల్ 5 న ఫ్యామిలీ స్టార్ థియేటర్లలోకి రానుంది అంటూ విడుదల తేదీని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా సక్సెస్ విజయ్ దేవరకొండకు కెరియర్ కు చాల అవసరమనే చెప్పాలి.
గీత గోవిందం మూవీ సక్సెస్ తరువాత ఆ స్థాయి విజయాన్ని విజయ్ అందుకోకపోవడంతో పరుశురాం విజయ్ కాంబోలో వస్తున్న ఈ ఫ్యామిలీ స్టార్ తో ఆ స్థాయి హిట్ కొట్టాలని రౌడీ బాయ్ తో పాటు ఆయన ఫాన్స్ కూడా ఎదురు చూపులు చూస్తున్నారు.




