విజయ్ దేవరకొండ… బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఒక రేంజ్ చేరుకున్న హీరోల లిస్ట్ తీస్తే విజయ్ దేవరకొండ పేరు కచ్చితంగా ముందు వరసలో ఉంటుంది. విజయ్ దేవరకొండకి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమాల లిస్ట్ తీస్తే ప్రముఖంగా కనిపించే సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రస్తుతం ఖుషి.
ఇందులో అర్జున్ రెడ్డిని పక్కనపెడితే మిగతా అన్నిట్లో కొంచెం సాఫ్ట్ పాత్రలే చేసాడు విజయ్ దేవరకొండ. నిజానికి విజయ్ ఫేస్ కట్ కు ఎలాంటి పాత్ర అయినా ఇట్టే సూట్ అవుతుంది. కానీ విజయ్ ఎప్పుడు మాస్ సినిమా చేసినా కూడా కొంచెం ఎదురుదెబ్బలే తగిలాయి. అర్జున్ రెడ్డి వంటి పాత్ బ్రేకింగ్ సినిమాను పక్కనపెడితే విజయ్ కు పెద్దగా మాస్ అండ్ హార్డ్ హిట్టింగ్ రోల్స్ సక్సెస్ ఇవ్వలేదు.
విజయ్ అందగాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. తన పాత్రను అండర్ ప్లే చేస్తూ నటించిన గీత గోవిందం బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలే సృష్టించింది. అలాగే పెళ్లి చూపులు కూడా. ఇప్పుడు ఇదే కోవలో ఖుషి కూడా వచ్చి చేరుతుందో లేదో అన్నది కొన్ని రోజుల్లో డిసైడ్ అవుతుంది. కానీ మొదటి రోజు టాక్ బట్టి చూస్తే విజయ్ ఖుషిలో సింపుల్ అయినా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. రొమాంటిక్ సినిమాలకు తాను పెర్ఫెక్ట్ గా సెట్ అవుతానని మరోసారి నిరూపించాడు విజయ్ దేవరకొండ.
మొత్తానికి లైగర్ వంటి దెబ్బ తర్వాత కోలుకునే సినిమాతోనే వచ్చాడు విజయ్. ఖుషిలో సమంతను డామినేట్ చేసాడు. విజయ్ గ్లామర్ ను సమంత మ్యాచ్ చేయలేదు అనడం అతిశయోక్తి కాదేమో. లైగర్ కు ముందు తాను ఇక రొమాంటిక్ మూవీస్ చేయను అని చెప్పిన విజయ్, రూట్ మార్చుకుని మంచి పనే చేసాడు.



