టాలీవుడ్ లో చాలామంది ‘స్టార్’లు ఉన్నారు. ‘సూపర్’ నుండి ‘నాచురల్’ వరకు చాలామందికి ఇలాంటి బిరుదులు అంకితం అయిపోయాయి. అయితే కొత్త ట్రెండ్ సృష్టించడానికి విజయ్ దేవరకొండ ప్రయత్నిస్తున్నాడు. తనకు ఈ ‘స్టార్’లు ఏమీ వద్దు, కొత్తగా ట్రై చేద్దాం, సరికొత్త ట్రెండ్ ను సృష్టిద్దాం… అంటూ ఓ ప్రింట్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ADVERTISEMENT
[m9ad]
అందులో భాగంగా “రాజాది రాజా” అనే పేరును స్వయంగా విజయ్ దేవరకొండనే ప్రస్తావించారు. ‘రాజాధిరాజా విజయ్ దేవరకొండ’ అని చెప్తుండగా, సదరు మీడియా ప్రతినిధి ‘దేవాధిదేవా’ అన్నా మస్తుగుంటుందని చెప్పగా, ఇలాంటివి పెట్టుకుందాం అంటూ విజయ్ దేవరకొండ కూడా ఓ నవ్వు నవ్వేసారు. ‘గీత గోవిందం’ ఫలితం తర్వాత సోషల్ మీడియాలో ‘సూపర్ పవర్ స్టార్’గా విజయ్ ని కీర్తించిన విషయం తెలిసిందే.
ADVERTISEMENT



