సినిమాలు తగ్గిస్తా అంటూ ‘ఫాన్స్’కి షాక్ ఇచ్చిన ‘స్టార్ హీరో’ !

Vijay Deverakonda -says only one movie per yearతెరపై తమ హీరో కనిపిస్తే ఆనందంతో ఊగిపోయే ఫాన్స్ చాలా మంది హీరోలకే ఉన్నారు. అయితే ముఖ్యంగా టాప్ హీరోల విషయం కాస్త పక్కన పెట్టేస్తే. కుర్ర హీరోల్లో విజయ్ దేవరకొండకు మంచి ఫాన్స్ ఉన్నారు అని చెప్పవచ్చు. పట్టుమని పది సినిమాలు చెయ్యకపోయినా ఆయన సినిమా కోసం వెయిట్ చేసే అభిమానులు విజయ్ సొంతం. అయితే పెళ్లి చూపులు నుంచి నేటి ట్యాక్సీ వాలా వరకూ తాను చేసిన సినిమాల్లో నోటా మినహా అన్నీ ప్రేక్ష ఆదరణ పొందిన సినిమాలే. ఇక యూత్ లో ముఖ్యంగా అమ్మయిల్లో ఈ కుర్ర హీరోకి క్రేజ్ మామూలుగా లేదు అనే చెప్పాలి. మరి అంత క్రేజ్ ఉన్న హీరో తన ఫాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. అసలు ఎవ్వరూ కలలో కూడా అనుకోని మ్యాటర్ ను ఫాన్స్ కి చెప్పాడు. అసలు ఇంతకీ విజయ్ ఏం చెప్పాడు? ఫాన్స్ హర్ట్ అయ్యే ఆ విషయం ఏంటి? అని వివరాల్లోకి వెళితే, వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ తాను నటించిన ట్యాక్సీ వాలా హిట్ కావడంతో ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అయితే ఒకానొక సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ ఇప్పటి నుంచి తాను వరుసగా సినిమాలు చెయ్యను అని, ఏడాదికి ఒకే ఒక్క సినిమా మాత్రమే చేస్తాను అని తెలిపాడు.

ADVERTISEMENT

[m9ad]

ఇక ఈ న్యూస్ విన్న ఫాన్స్ షాక్ కి గురి అయ్యారు. అసలు ఇలాంటి నిర్ణయం విజయ్ ఎందుకు తీసుకున్నాడు అంటే, వరుస సినిమాల వల్ల సినిమా కధను ఎంచుకునే సమయంలో ఆ సినిమాలపై ప్రభావం పడుతుంది అని, దాని వల్ల సినిమా ఫ్లాప్ అవుతుంది అని, అలా ఒత్తిడికి లోనయ్యి చేసిన సినిమానె నోటా అని, అందుకే ఇక జాగ్రత్త పడి, ఒక్కో ఏడాది ఒక్కో సినిమానె చేస్తా అంటూ తెలిపాడు విజయ్. అయితే ఇదిలా ఉంటే ఒక పక్క బడా హీరోలు ఏడాదికి రెండు సినిమాలకు మించి చెయ్యాలి అని విశ్వ ప్రయత్నాలే చేస్తుంటే, ఎంత క్రేజ్ ఉంటే మాత్రం కొత్త హీరో అయిన విజయ్ ఇలాంటి డిసిషన్ తీసుకోవడం అటు అభిమానులకు, ఇటు నిర్మాతలకు మింగుడు పడటం లేదు.

అయితే చిన్న నిర్మాతలకు హీరోగా ఉన్న విజయ్ నిర్ణయంతో ఆ చిన్న నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు అనే చెప్పాలి. ఇక ఈ నిర్ణయానికి తాము ఒప్పుకోం అని, విజయ్ వీలైనన్ని సినిమాలు చెయ్యాల్సిందే అని, సోషియల్ మీడియాలో ఆయన ఫాన్స్ హంగామా చేస్తున్నారు. మరి ఫాన్స్ మాట కోసం అయినా విజయ్ తన మనసు మార్చుకుంటాడేమొ చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories