విజయ్ దేవరకొండ… రూటే… సపరేటు..!

Taxiwala-Box-Office-Collections‘టాక్సీవాలా’ అనూహ్యమైన సక్సెస్ తో ఫుల్ ఖుషీలో మునిగి తేలుతున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనతో మిక్కిలి సంతోషంతో ఉన్న చిత్ర యూనిట్, ఆదివారం నాడు హైదరాబాద్ లోని ‘టాక్సీవాలా’ ప్రదర్శితం అవుతోన్న కూకట్ పల్లిలోని అర్జున్ ధియేటర్ కు వెళ్లి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

[m9ad]

ADVERTISEMENT

‘మీరు ఇంత పెద్ద హిట్ చేసినందుకు నా నుండి చిన్న పార్టీ, క్యాంటీన్ లో ఏం కావాలంటే అది తీసుకోండి బిల్ నాదే’ అంటూ చెప్పడంతో ప్రేక్షకులు రెట్టించిన ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ఆడియన్స్ మనసులను కొల్లగొట్టడంలో విజయ్ దేవరకొండ ‘రూటే సపరేటు’ అన్న రీతిలో చెలరేగిపోతున్నాడు. నవతరం హీరో అంటే విజయ్ అనే పేరు మాత్రమే వినిపించేలా ప్రస్థానం సాగుతోంది.

ప్రేక్షకులకు విజయ్ దేవరకొండ అలా పార్టీ ఇచ్చి వచ్చిన తర్వాత, అల్లు అర్జున్ నుండి ‘టాక్సీవాలా’ యూనిట్ కు మరో పార్టీ లభించింది. ‘గీత గోవిందం’ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ బన్నీ మరోసారి విజయ్ సినిమాకు పార్టీ అరేంజ్ చేసాడు. ఏపీ, తెలంగాణాలతో పాటు ఓవర్సీస్ లోనూ తొలి రెండు రోజుల కలెక్షన్స్ స్టడీగా ఉండడంతో, ఇప్పటికే సేఫ్ జోన్ లోకి ఈ ప్రాజెక్ట్ వెళ్లిపోయింది.

ADVERTISEMENT
Latest Stories