ఇలా అయితే క్రేజ్ పోతుంది!

vijay deverakonda taxiwala postponedచెప్పిన సమయానికి సినిమాను రిలీజ్ చేయలేకపోతే… ఆ మూవీ పట్ల ఏర్పడే క్రేజ్ పూర్తిగా తగ్గిపోతున్న వైనం తెలిసిందే. గతంలో నాగార్జున ‘డమరుకం’ మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమాల సందర్భంలో స్పష్టంగా కనిపించాయి. అంటే స్టార్ వాల్యూతో సంబంధం లేకుండా ఆయా సినిమాల పట్ల ప్రేక్షకుల ఆసక్తి సన్నగిల్లిపోతుందన్న విషయం స్పష్టమైంది.

ADVERTISEMENT

ప్రస్తుతం ఇదే కోవలో విజయ్ దేవరకొండ తాజా మూవీ పయనిస్తోంది. ‘అర్జున్ రెడ్డి’తో యమా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, తాజాగా “టాక్సీవాలా” రూపంలో రాబోతున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా మే 14వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ అన్న కారణంతో జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని స్వయంగా విజయ్ దేవరకొండ ప్రకటించారు.

కానీ ప్రస్తుతం అలా చెప్పిన టైంకు కూడా వచ్చేలా లేదన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఏకంగా మరో నెల పాటు వాయిదా ప్రకటన రానుందని లేటెస్ట్ న్యూస్. కాస్త ఆలస్యమైనా ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉండడం బెటర్ అన్న ఉద్దేశంతో చిత్ర యూనిట్ భావించినప్పటికీ, ఈ వాయిదాలు మాత్రం సినిమా పట్ల, ఆ హీరో పట్ల ఉన్న క్రేజ్ ను తగ్గిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. యువీ క్రియేషన్స్ సంస్థ అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్!

ADVERTISEMENT
Latest Stories