హీరోయిన్ కాళ్ళ మీద హీరో గారు!

Rashmika Mandanna - Vijay-Deverakondaఒక కొత్త హీరోయిన్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్న హీరో గురించి ఎప్పుడైనా విన్నారా? భవిష్యత్తులో చెప్పేందుకు మాత్రం ఆదివారం నాడు ఒక సంఘటన చోటు చేసుకుంది. ‘గీత గోవిందం’ ఆడియో స్టేజ్ పైన హీరోయిన్ రశ్మిక ఆశీర్వాదం కావాలంటూ హీరో విజయ్దేవరకొండ ఆమె కాళ్ళకు నమస్కరించాడు.

[m9ad]

ADVERTISEMENT

పబ్లిసిటీ స్టంట్ అయినా గానీ, విజయ్ మరోసారి తన మార్క్ తో స్టేజ్ ను అల్లాడించేసాడు. పెద్దలందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఓ పనైపోతుంది అన్నట్లుగా… అల్లు అరవింద్ మొదలుకుని అందరి కాళ్ళకు నమస్కారం పెట్టిన విజయ్, అమ్మో మా మేడం గారి ఆశీర్వాదం కూడా కావాలంటూ హీరోయిన్ రశ్మిక కాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేసాడు.

దీంతో అవాక్కైన రశ్మిక, వెనక్కి వెనక్కి జరుగగా, వదలని విజయ్ చివరకు తాను అనుకున్నది సాధించాడు. ఊహించని ఈ సంఘటనతో స్టేజ్ అంతా ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతోన్న ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకం విజయ్ తో పాటు ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది.

ADVERTISEMENT
Latest Stories