తన ప్రేమను వరల్డ్ ఫేమస్ చేసే పనిలో విజయ్ దేవరకొండ

Dear Comrade’s Vijay Deverakonda Is Now World Famous Loverయూత్ హార్ట్ త్రొబ్ విజయ్ దేవరకొండ ఇప్పుడు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ డైరెక్టర్ క్రాంతి మాధవ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది. దానితో సినిమా పేరు ప్రకటించి ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ గా సినిమాకు నామకరణం చేశారు. లవర్ బాయ్ గా పేరుగాంచిన విజయ్ కు ఇది సరైన టైటిల్ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజబెల్లా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ADVERTISEMENT

ఈ సినిమాలో అధికభాగం పారిస్‌లో షూట్ చేశారు. మిగిలిన షూటింగ్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేస్తున్నారు. ఈ నెల 20న ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేవరకొండ చివరి సినిమా డియర్ కామ్రేడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీనితో ఈ సినిమాపై ఆయన చాలా ఆశలే పెట్టుకున్నాడు. క్రాంతి మాధవ్ కూడా ఉంగరాల రాంబాబు అంటూ తన మీద ఇంప్రెషన్ కూడా చెడిపోయే రేంజ్ సినిమా ఒకటి తీసాడు. దానితో ఆయనకు కూడా ఈ సినిమా హిట్ కావడం ఎంతో అవసరం.

ఇప్పటివరకు ఈ చిత్ర బృందం ఈ సినిమాను ఎప్పుడు విడుదల చెయ్యాలి అనుకుంటున్నదీ చెప్పలేదు. ఫస్ట్ లుక్ తో పాటు దానిని ధృవీకరించే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో హీరో సినిమాలో నటిస్తున్నాడు విజయ్. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే, హీరో చిత్రం పూర్తి చేసి ఆ తరువాత 2020 జనవరిలో పూరి జగన్నాధ్ తో చెయ్యబోయే ఫైటర్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడు విజయ్.

ADVERTISEMENT
Latest Stories