సౌత్ ఇండియా రికార్డుల దిశగా సాగుతోంది!

Vijay Sarkar Teaser 10 million views on youtubeతమిళ స్టార్ హీరో విజయ్ కున్న మాస్ ఫాలోయింగ్ కు నిదర్శనంగా “సర్కార్” సినిమా తొలి టీజర్ యూ ట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతోంది. దసరా సందర్భంగా శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు యూ ట్యూబ్ లో ప్రత్యక్షం అయిన ఈ టీజర్ విజయ్ అభిమానులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.

[m9ad]

ADVERTISEMENT

మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వీరిద్దరి కాంబోకు ‘హ్యాట్రిక్.’ దీంతో భారీ అంచనాలు నెలకొన్న ఈ టీజర్ పై సంతృప్తి పరచడంతో యూ ట్యూబ్ లో దక్షిణాది సినిమాల రికార్డులను బద్దలు కొడుతూ సాగుతోంది. విడుదలైన 12 గంటలలోనే 10 మిలియన్ వ్యూస్ ను అవలీలగా అందుకున్న ఈ టీజర్, 24 గంటలు గడిచే సమయానికి ఆ సంఖ్యను డబుల్ చేసేలా కనపడుతోంది.

అంతేకాదు, లైక్స్ విషయంలోనూ ఇప్పటికే 1 మిలియన్ సంఖ్యను దాటేసి 1.5 మిలియన్ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో తొలిరోజే పాత రికార్డులన్నీ కనుమరుగవుతున్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కు జంటగా కీర్తి సురేష్ కన్నులవిందు చేస్తోంది. తెలుగులోనూ ఈ సినిమా “సర్కార్” పేరుతో డబ్ అవుతోంది.

ADVERTISEMENT
Latest Stories