తెలుగులో మెగాస్టార్ తో.. తమిళంలో సూపర్ స్టార్ తో ..

After Megastar It Is Superstar Rajinikanth For Vijay Sethupathiమక్కల్ సేతుపతి .. విజయ్ సేతుపతి.. తమిళనాడు లో మంచి ఊపు మీద ఉన్న హీరో. సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు వేయడం అతనికి ప్లస్ పాయింట్స్, ఈ మధ్యనే మాధవన్ తో కలిసి ‘ విక్రమ్ వేద’ సినిమా సినిమాలో నటించి హిట్ కొట్టాడు. తెలుగులో డబ్ అయిన ‘ నా పేరు శివ ‘ సినిమాలో కార్తీ స్నేహితుల్లో ఒకడిగా నటించాడు విజయ్ సేతుపతి. ‘ పిజ్జా ‘ సినిమాలో హీరోగా నటించింది విజయ్ సేతుపతినే.

తమిళనాడు లో పుట్టిన ఎవరికైనా .. రజినీ ని చూడాలని.. కలవాలని .. కోరిక ఉంటుంది. రజినీకాంత్ అభిమాని అయిన విజయ్ సేతుపతికి ఏకంగా రజినీతో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ త్వరలో రజినీకాంత్ తో – కార్తీక్ సుబ్బరాజు (పిజ్జా ) దర్శకత్వం లో ఒక సినిమా తీయనున్నారు. ఆ సినిమా లో విజయ్ సేతుపతి, ఒక ముఖ్య పాత్ర పోషించనున్నట్లు లైకా సంస్థ, ట్విట్టర్లో ప్రకటించింది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘సై రా ‘ లో కూడా .. విజయ్ సేతుపతి ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ‘ సైరా ‘లో విజయ్ సేతుపతి, అమితాబ్ తో కూడా కలిసి నటిస్తాడేమో? కలిసొచ్చే కాలం వస్తే .. విజయ్ కు రజిని సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. దీనికి కారణం కార్తీక్ సుబ్బరాజు, విజయ్ సేతుపతి తో ‘పిజ్జా ‘ సినిమా తీసాడు కార్తీక్ . అది తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.ఒక మోస్తరుగా ఆడటం తో విజయ్ కు తెలుగులో అంత గుర్తింపు రాలేదు. అల్ ది బెస్ట్ విజయ్ సేతుపతి రెండు లక్కీ ఛాన్సులు కొట్టేశావ్!.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories