సైరా నరసింహరెడ్డి : ఓబయ్యగా విజయ్ సేతుపతి

Vijay Sethupathi - Sudeep - Sye Raa Narasimha Reddyబాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు కానుకగా, సైరా నరసింహారెడ్డి లో బిగ్బీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సైరా చిత్ర బృదం అనంతరం విజయ్ సేతుపతి పాత్రను గురించిన పోస్టర్ విడుదల చేసింది. అయితే, విజయ్ ఫస్ట్ లుక్ అధికారికంగా విడుదల అయిందా లేదా లీక్ అయిందా అన్న విషయం పై సందిగ్థత నెలకొంది.

ADVERTISEMENT

[m9ad]

విడుదల అయినా పోస్టర్ లో విజయ్ సేతుపతి సూపర్ స్టార్ సుదీప్ పక్కన నిలపడి గంభీరమైన పాత్రా లో కనిపిస్తారు.సైరా లో విజయ్ సేతుపతి తమిళం మాట్లాడే ‘ఓబయ్య’ గా, చిరంజీవికి నమ్మకస్థుడుగా కనిపిస్తారు. కాగా, సుదీప్ ‘అవుకు రాజా’ గా కనిపించనున్నారు. సుదీప్ కి సంబందించిన ఫస్ట్ లుక్.. చిత్ర బృందం సెప్టెంబర్ 2 న విడుదల చేసినప్పటికీ, తాజాగా విడుదలైన పోస్టర్ లో సుదీప్ మరింత భీకరంగా కనిపిస్తారు.

అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతి బాబు, తమన్నా ప్రధాన పాత్రల్లో కనిపించే సైరా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం సైరా చిత్ర షూటింగ్ జార్జియా నగరంలో జరుగుతోందని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories