మొన్న ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ప్రభుత్వం టాప్ చేస్తుందని ఒక పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వెంటనే రాష్ట్ర డీజీపీ ఆయనకు ఒక ఉత్తరం రాసి అందుకు గల ఆధారాలు తమకు సమర్పిస్తే దర్యాప్తు చేస్తామని చెప్పుకొచ్చారు.
ఈ ప్రకారంగా చంద్రబాబుని తాము ఇరుకున పెట్టాం అని ప్రభుత్వం చెప్పుకుంది. ఆ విషయం అలా ఉంచితే… ఇటీవలే రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న అంతర్వేది రథం దగ్ధం కేసులో అధికారపక్ష నేతలు చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబే చేయించారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు
ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరాం. త్వరలోనే చినబాబు, పెదబాబు హస్తం బయటపడుతుంది. ఈ ఘటనలో గుంటూరు, హైదరాబాద్ వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు అని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు.
దీంట్లో నిజానిజాలు పక్కనపెడితే… డీజీపీ మరి వీళ్ళకి నోటీసులు ఇవ్వరా? మొన్న చంద్రబాబుకు ఇచ్చినట్టుగా సాక్ష్యాలు ఆధారాలూ తీసుకొని మా ఆఫీసుకి రండి అని? అలా ఇవ్వకపోతే పోలీసులు అధికార పక్షం చేతిలో కీలుబొమ్మగా మారారు అనే అపప్రధ వస్తుందేమో కదా?





