విజయవాడ..తాడేపల్లి: నో హెల్మట్, నో ఎంట్రీ..!

vijayawada..tadepalli-no-helmet-no-entry..

పౌరుల రక్షణ ప్రభుత్వ బాధ్యత, వారి క్షేమం అధికారుల కర్తవ్యం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ ఈ అంశం మీదే అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులకు మొట్టికాయలు వేసింది.

వాహనదారులు హెల్మట్ ధరించకుండా రోడ్ల మీదకు రావడంతో రోడ్ యాక్సిడెంట్స్ లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కూడా మీరు కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటూ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అటు అధికారులు తమ మత్తు వదిలి డ్యూటీ ఎక్కారు.

ADVERTISEMENT

ఇక పై రోడ్ల మీదకు హెల్మట్ లేకుండా వస్తున్న టూ వీలర్ వాహనదారుల పై కఠిన చర్యలు తప్పవంటూ ఎనౌన్స్ మెంట్స్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. అలాగే ఇకపై ‘నో హెల్మట్ నో ఎంట్రీ’ అంటూ విజయవాడ, తాడేపల్లి పోలీసులు ఆ దిశగా వస్తున్న వాహనదారుల పై రూల్స్ ను స్ట్రిట్ గా అమలు చేస్తున్నారు.

ముఖ్యంగా విజయవాడ ముఖ్య కూడలిలో పోలీసులు ఇటువంటి వారిని జల్లపడుతు వారికి హెల్మట్ వాడకం పై అవగాహనా కల్పిస్తున్నారు. అలాగే వారి పై కేసులు పెట్టి మరోసారి ఇలా హెల్మట్ ధరించకుండా రోడ్ల మీదకు వస్తే చర్యలు మరింత కఠినంగా ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు. దీనితో వాహనదారులు పోలీసులను చూసి బెంబేలెత్తిపోతున్నారు.

అయితే పోలీసు అధికారులు వ్యవరిస్తున్న ఈ వైఖరి పై కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ వారి పై విమర్శలకు దిగుతుంటే, మరికొంతమంది అధికారులు ఇలా కఠినంగా ఉంటేనైనా యువత ట్రాఫిక్ నిబంధలను జాగ్రత్త పాటిస్తూ హెల్మట్ లను ధరించి తమ ప్రాణాలను కాపాడుకుంటారు అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని, అధికారుల పని తీరుని ప్రశంసిస్తున్నారు.

అయితే ఇది కేవలం ఫైన్ వేసి ప్రజలను బాధపెట్టే ఉద్దేశంతో తీసుకున్న చర్యలుగా భావించవద్దని, పౌరుల ప్రాణాలను కాపాడే ఒక మహాయజ్ఞం లా భావించి తమకు సహకరించాలంటూ అధికారులు ప్రజలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రజలు ఫైన్ లకు భయపడైన హెల్మట్ ధరిస్తే చాలు అంటున్నారు ట్రాఫిక్ సిబ్బంది.

ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు అధికారులు ఇచ్చే ఆదేశాలను పాటించడం పౌరులుగా మన విధి. మన భద్రత మన బాధ్యత అనే సృహతో అందరు ఆలోచిస్తే అసలు ఈ సమస్యే ఉత్పన్నం కాదు. హెల్మట్ ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలదు అని ఎన్నో సంఘటనలు రుజువు చేసినప్పటికీ మెగా హీరో సాయి దుర్గ తేజ్ ఉదాంతం కళ్ళ ముందు సజీవ సాక్ష్యంలా కనిపిస్తుంది. కాబట్టి హెల్మట్ వాడకం మనకే కాదు మన కుటుంబానికి శ్రీరామా రక్ష.

ADVERTISEMENT
Latest Stories