లుక్ ఒకే…కానీ కంటెంట్ సంగతి ఏంటి?

Vikram Kadaram Kondanతమిళ నటుల్లో మంచి టాలెంట్ ఉన్న వారిలో విక్రమ్ ఒకడు..ఎందుకంటే విక్రమ్ కి నటనపై ఉన్న ఆసక్తి అలాంటిది…అయన తన నటనతో చూపించే ఆహార్యం అలాంటిది. కానీ ప్రయోగాలకు పైసలు రాలవు అన్న నానుడిని నిజం చేస్తూ విక్రమ్ కి హిట్ వచ్చి దాదాపుగా పుష్కర కాలం అయ్యింది అంటే బహుశా అతిశయోక్తి కాదేమో.

ADVERTISEMENT

[m9ad]

2005 అపరిచితుడు తర్వాత దాదాపుగా 10 కి పైగానే సినిమాలు చేసిన విక్రమ్ పాపం ఆ రేంజ్ హిట్స్ కోసం భారీగానే ట్రై చేస్తున్నాడు….రకరకాల వేషాలు వేస్తున్నాడు…కానీ ఫలితం మాత్రం మారడంలేదు…ఇదిలా ఉంటే తాజాగా విక్రమ్ మరో కొత్త స్టైల్ లో మన ముందుకు వచ్చేసాడు…కమల్ సంస్థ ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్’ నిర్మాణంలో విక్రమ్ హీరోగా కమల్ హాసన్ శిష్యుడు రాజేష్ సెల్వ రూపొందిస్తున్న సినిమాలో చియాన్ ఫారిన్ కాప్ పాత్రలో మెప్పించనున్నాడు..

కట్ చేస్తే తాజాగా విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయేలా ఉంది..ఇక ఈ సినిమా హాలీవుడ్ మూవీ ‘డోంట్ బ్రీత్’కు రీమేక్ అని, తమిళ్ లో కదరం కొండాన్ పేరుతో రూపొందుతుంది అని తెలుస్తుంది. అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటి అంటే…చియాన్ యధావిధిగా లుక్ అదరగొట్టేశాడు..

అయితే చియాన్ లుక్ చూసి ఆయన సినిమాలకు వెళ్లడం విషయంలో గత అనుభవాల దృష్ట్యా ప్రేక్షకులు భయపడుతున్నారు..మరి ఈ సినిమాలో అయినా చియాన్ మంచి కంటెంట్ తో వస్తున్నాడో…లేక యధావిధిగా లుక్ లో సరిపెట్టనున్నాడో..చూడాలి..

ADVERTISEMENT
Latest Stories