ఆ ఫ్లాప్ ఈ సినిమాకి ప్లస్ అవుతుందా?

Vinaya Vidheya Rama -disaster plus to Balakrishna - boyapati sreenu -movieఅవును నిజమే…చెర్రీ వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ గా మారడం బోయపాటి తర్వాత చెయ్యబోయే సినిమాకు కలసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటారా అక్కడే ఉంది అసలు లాజిక్. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే, బోయపాటి తీసిన సినిమాల్లో కల్లా డిజాస్టర్ ఏది అంటే ఖచ్చితంగా అది వినయ విధేయ రామ అనే చెప్పవచ్చు.

ఎందుకంటే ఆ సినిమా వల్ల బయ్యర్స్ ఆ రేంజ్ లో నష్టపోయారు. ఇదిలా ఉంటే అవేమి పట్టించుకోకుండా బాలయ్య తన తర్వాత సినిమా బోయపాటితో చేసేందుకు రంగం సిద్ధం చేసేస్తున్నాడు. ఈ క్రమంలో వినయ విధేయ రామ హిట్ అయ్యి ఉంటే బాలయ్య- బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఉండేవి.

ADVERTISEMENT

పైగా ఈ సినిమాకు ముందు ఇప్పటికే సింహ, లెజెండ్ తో దుమ్మి రేపిన ఈ ఇద్దరి కాంబినేషన్ అంటే మెమోలు ఎక్సపెక్టషన్స్ ఉండవ్..అయితే ఏ రకంగా చూసుకున్నా ఈ సినిమాకి మంచే జరిగింది అని అంటున్నాయి నందమూరి అభిమాన వర్గాలు. ఎక్సపెక్టషన్స్ ఏమి లేకపోతేనే రిజల్ట్ విషయంలో టెన్షన్ ఉండదు అనేది వారి వాదన.

ఏది ఏమైనా…చెర్రీ ఫ్లాప్ బాలయ్య సినిమాకు ఆలా కలసి వచ్చింది అనే చెప్పాలి. అయితే ఇక్కడ కాస్త ఇబ్బందికర పరిణామం ఏంటి అంటే, బిజినెస్ విషయంలో ఈ సినిమా కాస్త ఇబ్బంది పడక తప్పదు. ఎందుకంటే బోయపాటి ఫ్లాప్ లో ఉన్నాడుగా.

ADVERTISEMENT
Latest Stories