తెర వెనుక అసలు నిజం – ‘శివ’ సినిమా హీరో వేరే!

vinod bala about siva movieతెలుగు సినీ గమనాన్ని మార్చిన చిత్రంగా “శివ” సినిమాను పేర్కొంటారు. ఈ సినిమా ద్వారానే అక్కినేని నాగార్జున కెరీర్ కూడా మరో మలుపు తీసుకుంది. అయితే అసలు ఈ సినిమాలో ముందుగా హీరో ఎవరిని అనుకున్నారో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. అప్పట్లో చిన్న చిన్న సీరియల్స్ చేస్తూ ఉన్న నటుడు వినోద్ బాలను నాగార్జున పాత్రలో ఓ అయిదు, పది సన్నివేశాలు కూడా వర్మ చిత్రీకరించారని ఇటీవల ఓ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వినోద్ బాల చెప్పుకొచ్చారు.

ఇలా ట్రయిల్ షూట్ లో భాగంగా రెండు, మూడు రోజుల పాటు తనతో చేసిన షూటింగ్ సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియో వారికి శాంపిల్ గా చూపించారని, ముందుగా జేడీ పాత్రకు తనను తీసుకుంటానని వర్మ చెప్పారని, అయితే ఆ తర్వాత ఎత్తు తక్కువగా ఉందని తనకు ఆ అవకాశం దక్కలేదని తెలుసుకున్నానని నవ్వుతూ చెప్పేసారు. అప్పటినుండి ఇండస్ట్రీ పోకడ తెలుసుకున్నానని, సక్సెస్ ఉంటేనే ఇండస్ట్రీలో మనుగడ అని తన గత అనుభవాలను చెప్పుకొచ్చారు దాదాపు 5000 సీరియల్స్ పాత్రలు పోషించిన వినోద్ బాల.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories