వైరల్ – హీరోయిన్ తో ప్రొడ్యూసర్లు!

viral photo Producers behaviour while paying heroineసినీ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు సంతోష్ శివన్. సినిమాటోగ్రాఫర్ గానే కాకుండా ‘ఉరిమి’ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన సంతోష్ శివన్, గతేడాది మహేష్ “స్పైడర్” సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్ గా విధులు నిర్వహించి తెలుగు నాట బాగానే పాపులర్ అయ్యారు. తాజాగా ట్విట్టర్ ఆయన పోస్ట్ చేసిన ఓ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

[m9ad]

ADVERTISEMENT

సాంకేతిక నిపుణులతో ఉండే సమయంలో నిర్మాత కాట్ల కుక్క మాదిరి అరుస్తూ ఉంటారని… అలాగే హీరోయిన్లతో అయితే నిర్మాతలు ఇలా చూస్తూ ఉంటారని… పోస్ట్ చేసిన పిక్ ఫన్నీగా ఉంది. ఈ పిక్ నెటిజన్ల నుండి విశేషమైన స్పందన లభించింది. హీరోయిన్ అదితిరావు కూడా స్పందించి, ఆనందభాష్పాలతో కూడిన ఎమోజీలను పోస్ట్ చేసింది. ఇండస్ట్రీలో సహజంగా జరిగే విధానాన్నే సంతోష్ పోస్ట్ చేసారన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories