విరాట్ రికార్డులు… సచిన్ పేరు మారుమ్రోగుతోంది..!

Virat-Kohliప్రపంచ క్రికెట్ ను ఇప్పుడు విరాట్ శకం శాసిస్తోంది. సెంచరీల మీద సెంచరీలను అవలీలగా సాధిస్తూ…. ‘ఔరా’ అనిపించే విధంగా రికార్డులను సాధిస్తున్నాడు. తాజాగా వెస్టీండీస్ తో జరుగుతున్న రెండవ వన్డేలో సాధించిన సెంచరీతో, అత్యంత వేగంగా పది వేల పరుగుల మార్క్ ను అందుకున్న క్రికెటర్ గా సరికొత్త చరిత్రను లిఖించాడు.

[m9ad]

ADVERTISEMENT

అంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (259 ఇన్నింగ్స్ లలో) పేరిట ఉండగా, కోహ్లి కేవలం 205 ఇన్నింగ్స్ లలోనే అందుకున్నాడు. అలాగే విశాఖపట్నం వేదికగా చెలరేగిపోయే కోహ్లి, ఈ గ్రౌండ్ లో నాలుగవ సెంచరీని నమోదు చేసాడు. 118, 117, 99, 65, 167, 81, 157*… ఇవి వరుసగా విశాఖలో కోహ్లి మెషిన్ పని చేసిన తీరు.

194వ ఇన్నింగ్స్ లో 9 వేల మైలురాయిని అందుకున్న కోహ్లి, కేవలం 11 ఇన్నింగ్స్ ల తేడాలో 10 వేల పరుగులను అందుకోవడం అనిర్వచనీయం, అమోఘం. అలాగే ఒకే ఏడాదిలో 1000 పరుగులకు పైగా నమోదు చేయడం ఇది 6వ సారి. ఇందులోనూ అత్యధికంగా ఉన్న సచిన్ టెండూల్కర్ (7 సార్లు) రికార్డును వేటాడుతున్నాడు కోహ్లి.

ఈ సెంచరీ ద్వారా మరో సచిన్ రికార్డును కూడా కోహ్లి బద్దలు కొట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో అయిదు కంటే ఎక్కువ సెంచరీలు 2 సార్లు సచిన్ సాధించగా, ఈ సెంచరీతో విరాట్ కోహ్లి ఆ సంఖ్యను మూడుకు చేర్చి, సచిన్ పేరును క్రిందికి జరిపాడు. ఒకప్పుడు “రికార్డులకు రారాజు”గా సచిన్ పేరు ఎలా అయితే హల్చల్ చేస్తుందో, ఇప్పుడు కోహ్లి పేరు అలా మారుమ్రోగుతోంది.

ADVERTISEMENT
Latest Stories