విశాఖ ప్రజలకు జగన్‌ మరో బిస్కట్?

Visakhapatnam-Metro-Railఈసారి ఎన్నికలలో ప్రతిపక్షాలు తప్పకుండా అమరావతి గురించి గట్టిగా మాట్లాడుతాయి కనుక ‘విశాఖ రాజధాని’ అని ప్రజలను నమ్మించగలిగినా చాలు… ఈ గండం గట్టెక్కవచ్చని వైసీపి భావిస్తున్నట్లుంది. అందుకే సిఎం జగన్‌ దసరా ముహూర్తం పెట్టుకొన్నట్లున్నారు?

అయితే విశాఖను రాత్రికి రాత్రి రాజధానిగా మార్చేయడానికి ప్రభుత్వం వద్ద మంత్ర దండం ఏమీ లేదు కనుక ఈ పేరుతో ఎన్నికల వరకు హడావుడి చేస్తూ ప్రజలను మభ్యపెట్టగలిగితే చాలని అనుకొంటున్నారేమో?

ADVERTISEMENT

ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు, ముఖ్యంగా విశాఖ నగర ప్రజలకు వైసీపి ప్రభుత్వం మరో ఎన్నికల బిస్కట్ సిద్దం చేసింది. అదే మెట్రో రైల్, మోడర్న్ ట్రామ్ ప్రాజెక్టులు!

రూ.19,632 కోట్లు వ్యయంతో నిర్మించబోయే ఈ భారీ ప్రాజెక్టుకి జనవరి 15వ తేదీన జగన్మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారట!

నిజానికి దీనికీ చంద్రబాబు నాయుడు హయాంలోనే చాలా ప్రయత్నాలు జరిగాయి. అప్పుడే మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. కానీ మెట్రో నిర్మాణ వ్యయం భారీగా ఉండటం, మెట్రోకు సరిపడే జనాభా లేకపోవడం వలన ఈ ప్రాజెక్ట్ లాభదాయకం కాదని మెట్రో గురూ శ్రీధర్ సూచించడంతో ప్రభుత్వం డైలమాలో పడింది.

నిన్న వైసీపి ఆత్మసాక్షిలో ‘విశాఖ వైపు మెట్రో పరుగులు’ పేరుతో వచ్చిన కధనంలో ఓ వాఖ్యం ఉంది. “లాభనష్టాలతో సంబందం లేకుండా కేవలం ప్రజలకు రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు మెట్రోపై దృష్టి సారించింది,” అని. అంటే మెట్రో లాభదాయకం కాదని తెలుసన్న మాట.

విద్యుత్ కొనుగోలు భారాన్నే ‘ట్రూఅప్‌’ పేరుతో ప్రజలను బాదేస్తున్న వైసీపి ప్రభుత్వం, లాభదాయకం కాని మెట్రోని నడిపిస్తే ఆ భారాన్ని ఒక్క విశాఖ ప్రజల మీదే కాదు యావత్ రాష్ట్ర ప్రజల మీద వేయకుండా ఉంటుందా?

జగన్‌ ప్రభుత్వానికి ఈ లాభనష్టాల లెక్కలేవీ తెలియకనే ఈ నాలుగున్నరేళ్ళు కాలక్షేపం చేసిందనుకోలేము. కనుక ఇప్పుడు ఎన్నికల గంట మ్రోగే ముందు మెట్రో ప్రాజెక్టుకి జగన్‌ శంకుస్థాపన చేస్తున్నారంటే అది ఎన్నికల బిస్కట్ అని అర్దమవుతూనే ఉంది.

అయినా వైసీపి మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో తెలీనప్పుడు శంకుస్థాపన చేయడం దేనికి?ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు శంకుస్థాపన చేసి నిర్మించేయవచ్చు కదా?

చివరిగా ఒక్క విషయం చెప్పుకోక తప్పదు. ఆనాడు అమరావతి ఫోటోలను, వీడియోలను గ్రాఫిక్స్ అని వాదించిన వైసీపి ఇప్పుడు విశాఖ మెట్రో, హార్బర్లు, భోగాపురం ఎయిర్ పోర్ట్ అంటూ గ్రాఫిక్స్ చూపిస్తోంది కదా?

ADVERTISEMENT
Latest Stories