బ్లాక్ బస్టర్ ను మిస్సయిన ఎన్టీఆర్, రామ్ చరణ్!

vishal-father-rejected-offers-for-ntr-ram-charanసినిమాలు చేతులు మారడం ఇండస్ట్రీలో చాలా సహజం. ఆ క్రమంలో అవి బ్లాక్ బస్టర్స్ అయినపుడు మాత్రం, ‘అయ్యో’ అనుకోవడం చాలా రొటీన్. అలాంటి సినిమాలలో “పందెం కోడి” కూడా ఉందన్న విషయం తాజాగా తేటతెల్లమైంది. నిజానికి ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో గానీ, రామ్ చరణ్ తో గానీ ప్రయత్నాలు జరిగాయట.

[m9ad]

ADVERTISEMENT

కానీ తన తండ్రి గట్టిగా పట్టుబట్టడంతో “పందెం కోడి” సినిమాను తాను చేశాను… అంటూ తాజాగా విశాల్ చెప్పుకొచ్చారు. అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమా సీక్వెల్ విడుదల కానున్న నేపధ్యంలో, ప్రమోషన్ లో భాగంగా సదరు సంగతులన్నీ తెలిపాడు విశాల్. ఈ సీక్వెల్ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుందన్న నమ్మకాన్ని విశాల్ వ్యక్తపరిచాడు. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ మాస్ ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.

ఇదిలా ఉంటే ‘పందెం కోడి’ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ గనుక చేసి ఉంటే… అన్న ఆలోచనలో యంగ్ టైగర్ అభిమానులు వెళ్తే, బహుశా అప్పటి రికార్డులన్నీ కనుమరుగు అయ్యేవేమో అనుకోవడం ఫ్యాన్స్ వంతు అవుతోంది. ఇక రామ్ చరణ్ గనుక చేయాల్సి వస్తే, బహుశా అదే తొలి సినిమా అయ్యేదేమో… ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకునేవాడేమో..!

ADVERTISEMENT
Latest Stories