ఈ విశ్వక్ కు ఏమైంది.?

Vishwak Sen Reaction on Laila Movie Negativity

కంటెంట్ కంటే కాంట్రవర్సీ తోనే ఎక్కువగా పాపులర్ అయిన యువ హీరో విశ్వక్ సేన్. ఆయన తాజా సినిమా లైలా కూడా విడుదలకు ముందే పొలిటికల్ కాంట్రవర్సీ లో చిక్కుకుని మీడియాలో తెగ ప్రచారం పొందింది.

అయితే ఆ ప్రచారానికి తగ్గ కంటెంట్ మూవీలో లేకపోవడం, కామెడీ పేరుతో అసభ్యాన్ని తెరకెక్కించడంలో సినిమా ఊహించని అపజయాన్ని ఎదుర్కొంది. అయితే ఒక హీరోకి హిట్లు వస్తుంటాయి, అలాగే ప్లాపులు ఎదురవుతాయి కానీ లైలా సినిమా విశ్వక్ సేన్ స్థాయిని తగ్గించింది.

ADVERTISEMENT

లేడీ గెటప్ పేరుతో అస్లీలం, అసభ్యం చూపించారు అంటూ విశ్వక్ నటన పై కూడా లైలా సినిమా నెగటివిటీని తీసుకొచ్చింది. అయితే ఆ సినిమా కు ప్రేక్షకుల నుంచి వచ్చిన రిజక్షన్ పై హీరో విశ్వక్ స్పందించారు. మీరు కోరుకున్న స్థాయికి నా సినిమాలు చేరుకోలేకపోయాయి.

లైలా సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శలను అంగీకరిస్తున్నా. అలాగే ఈ సినిమా పట్ల మీరిచ్చిన తిరస్కరణను గౌరవిస్తున్నా, ఇక పై క్లాస్ కానీ మాస్ కానీ నా నుంచి వచ్చే ఏ సినిమాలోనూ అసభ్యత అనేది లేకుండా చూసుకుంటా అంటూ ప్రేక్షకులకు ఒక లేఖ విడుదల చేసారు విశ్వక్.

త్వరలోనే మరో బలమైన కథతో మిమ్మల్ని అలరించడానికి థియేటర్లలో మీ ముందుకొస్తా అంటూ రాసుకొచ్చిన విశ్వక్, తన సినిమా పట్ల వచ్చిన నెగటివిటీ ని అంగీకరించారు, అలాగే ఆ మూవీ రిజల్ట్ తారుమారులవ్వడానికి గల కారణలను తెలుసుకున్నారు, అది ప్రేక్షకుల ముందు ఒప్పుకున్నారు.

ఇటువంటి మైండ్ సెట్ విశ్వక్ లో ఉంటుందా అంటూ విశ్వక్ సేన్ రాసిన లేఖ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు సినీ లవర్స్. ఈ నగరానికి ఏమైంది అంటూ యూత్ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ ఆ జోనర్ ఆడియెన్స్ నే టార్గెట్ గా మూవీలు తీస్తున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో విశ్వక్ నుండి వచ్చిన ఏ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేకపోతుంది. దీనితో ఇక విశ్వక్ గేరు మార్చక పోతే ఆయన సినీ కెరీర్ షెడ్ కెళ్ళే పరిస్థితులు స్పష్టంగా కనిపించడంతో మొత్తానికి విశ్వక్ చేసిన తప్పుఒప్పుకుని ఆ తప్పుని సరిదిద్దుకుంటా అంటూ ప్రేక్షకులకు మాట ఇచ్చారు.

మరి ఇచ్చిన మాట ప్రకారం విశ్వక్ తన తదుపరి చిత్రాలలో మరోసారి ఇటువంటి తప్పిదాలకు చోటివ్వకుండా జాగ్రత పడతారా.? కాంట్రవర్సీ మీద కాకుండా కంటెంట్ మీద నమ్మకంతో ముందుకొస్తారా.? అనేది చూడాలి. ఏది ఏమైనా ఇలా టాలెంట్ ఉన్న యువ హీరోలు తమ టాలెంట్ ను సక్రమైన మార్గంలో తీసుకెళ్లగలిగితే టాలీవుడ్ కి మరో స్టార్ హీరో దొరికినట్టే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories