ఎన్నాళ్ళో వేచిన సాయంత్రం!

Big-Names-Get-Behind-Vishwaroopam-2-Launchకమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన “విశ్వరూపం” ఎంతటి కీర్తి ప్రతిష్టతలను తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా క్లైమాక్స్ లో రెండవ పార్ట్ ఉంటుందని ఖరారు చేసిన కమల్, అప్పటికే కొంతభాగాన్ని షూటింగ్ పూర్తి చేసామని కూడా స్పష్టం చేసారు. అయితే ఆ తర్వాత ఎదురైన ఒడిదుడుకుల రీత్యా… ‘విశ్వరూపం 2’ వాయిదా పడుతూ వస్తోంది.

మధ్యమధ్యలో ఓ పోస్టర్ రిలీజ్ అవుతుండడం కమల్ అభిమానులకు ఊరట కలిగిస్తున్నా… సినిమా రిలీజ్ కావడం లేదన్న ఆవేదనే ఎక్కువగా ఉంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా విడుదలయ్యే సంకేతాలు కనపడుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, హిందీలో అమీర్ ఖాన్ రిలీజ్ చేయబోతున్నారని పోస్టర్స్ ను విడుదల చేసారు. ఈ సోమవారం నాడు సాయంత్రం 5 గంటలకు ‘విశ్వరూపం 2’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories