ఎవరీ వరంగల్ శ్రీను?…. పుష్ప, సర్కారువారి పాటకు భారీ ఆఫర్

Krack Movie Distributor Warangal Srinuనైజాంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వరంగల్ శ్రీను. వాల్మీకి, ఇస్మార్ట్ శంకర్ వంటి హిట్లు… డిస్కో రాజా వంటి ప్లాప్ ఆయన ఖాతాలో ఉన్నాయి. సంక్రాంతికి రవితేజ సూపర్ హిట్ సినిమా క్రాక్ విడుదల చేశారు. ఆ తరువాత తన సినిమాకు థియేటర్లు ఇవ్వడం లేదని… తనని దిల్ రాజు అవమానించారని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకిపారేశారు.

అక్కడితో ఆగకుండా ఈరోజు నుండి దిల్ రాజు, శిరీష్ రెడ్డిలను పడేయడానికే పని చేస్తా అంటూ మీడియా ముఖంగా ప్రతిజ్ఞ చేశారు. మహాశివరాత్రి కి శర్వానంద్ శ్రీకారం చెయ్యబోతున్నారు వరంగల్ శ్రీను వెంటనే దిల్ రాజు క్యాంపు తమ గాలి సంపత్ విడుదల చెయ్యనున్నట్టు ప్రకటించేసింది. దీనితో మళ్ళీ కయ్యానికి కాలుదువ్వడం ఖాయం.

ADVERTISEMENT

తాజాగా దిల్ రాజు కు చెక్ చెప్పడానికి వరంగల్ శ్రీను మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట.. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప కు చెరో నలభై కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. బాహుబలి సినిమాలకు తప్ప ఇప్పటివరకు నలభై కోట్ల బిజినెస్ ఏ సినిమాకు జరగలేదు. ఈ ఆఫర్లు ఇప్పుడు టాలీవుడ్ స్టన్ అయ్యింది.

ఈ రెండు సినిమాల నైజాం హక్కులు దక్కించుకుని దిల్ రాజు కు చెక్ పెట్టాలని వరంగల్ శ్రీను కృతనిశ్చయంతో ఉన్నాడట. మరి ఈ రెండు సినిమాలకు దిల్ రాజు ఎటువంటి కౌంటర్ ఆఫర్ ఇస్తారేమో చూడాలి. ఇది ఇలా ఉండగా… అసలు ఎవరీ వరంగల్ శ్రీను? ఇతని వెనుక ఎవరున్నారు? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ADVERTISEMENT
Latest Stories