
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సుమారు 30 ఏళ్ళపాటు కమ్యూనిస్టులు రాజ్యం ఏలారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వారిని గద్దె దించి 15 ఏళ్ళుగా ఏలుతున్నారు. ఇప్పుడు ఆమెను గద్దె దించి బిజేపి రాబోతోందని తాజా సర్వేలు చెపుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై వివిధ సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. వాటిలో ప్రధానమైన నాలుగు సంస్థల సర్వేలు చూసినట్లయితే బిజేపి విజయం సాధిస్తుందని మూడు చెప్పగా పీపుల్ పల్స్ మాత్రం అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పింది.
ఈసారి పశ్చిమ బెంగాల్లో 91శాతంపైగా పోలింగ్ నమోదవడానికి ప్రధాన కారణం బిజేపి సర్వశక్తులు ఒడ్డి పోరాడినందునే అనుకుంటే పెరిగిన పోలింగ్ శాతం బిజేపికి అనుకూలమని భావించవచ్చు. ఇంత భారీగా పోలింగ్ జరుగుతుండటంతో భారీగా రిగ్గింగ్ జరుగుతోందని సిఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అంటే ఆమె ఓటమిని పసిగట్టారనుకోవచ్చు.
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి స్థిరపడినవారికి ఆమె ప్రభుత్వం ఓటర్, ఆధార్, రేషన్ కార్డులు, సంక్షేమ పధకాలు అందించి బలమైన ఓటు బ్యాంక్ నిర్మించుకున్నారని బిజేపి ఆరోపిస్తుంటుంది. కేంద్ర ఎన్నికల కమీషన్ ‘సర్’ పేరుతో సుమారు 96 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితాలో నుంచి తొలగించింది. వారందరూ మమతా ‘ఓటు బ్యాంక్’ అని వేరే చెప్పక్కరలేదు. కనుక ఈసారి ఎన్నికలలో మమతా బెనర్జీ గెలవడం చాలా కష్టమేననిపిస్తోంది. సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. అవి నిజమైతే శాఖం మమతా బెనర్జీ శఖం ముగిసిపోయినట్లే!
మమతా బెనర్జీ: పశ్చిమ బెంగాల్లో ఓ ఒంటరి మహిళను ఓడించేందుకు కట్టకట్టుకు వచ్చిన బిజేపి పెద్దలు, మహిళా సమ్మాన్, మహిళా శక్తి అంటూ మాట్లాడుతుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ప్రతీవారం లానే ఈ వారం కూడా రెండుమూడు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో “జెట్లీ, గాయపడ్డ సింహం” ప్రముఖమైనవి. వీటిలో మోస్ట్…
ఇటీవల ఎన్నికలు జరిగిన నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఫలితాలపై వివిధ సర్వే సంస్థలు తమ ముందస్తు అంచనాలు…