నందమూరి వంశంపై రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. అటు సినిమా పరంగా, ఇటు రాజకీయం పరంగా ‘బాబాయి-అబ్బాయి’ మధ్య గ్యాప్ ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో పరిస్థితులు కూడా వారికి అనుకూలంగా లేకుండా పోయాయి. మొన్నటికి మొన్న సొంత సోదరి ఎన్నికల సంగ్రామంలో నిలబడితే, శుభాకాంక్షలతో సరిపెట్టారు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్. మరో పక్క ఆమె ఓటమి పాలైనా, రక్షణ కవచంలా తోడుగా నిలిచాడు బాలయ్య. మరో పక్క ఆ మధ్య ఎన్టీఆర్ ని బాలయ్య సరిగ్గా పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు వినిపించిన తరుణంలో మరో పక్క ఇప్పుడు ఎన్టీఆర్ కావాలనే ఆ కుటుంభానికి దూరంగా ఉంటున్నాడు అన్న వార్తలు కూడా వస్తున్న తరుణంలో అసలు ఆ వంశంలో ఏం జరుగుతుంది?
[m9ad]
ఎందుకు ఆ ఇద్దరు అన్నగారి కుటుుంభ సభ్యులు అలా ఎవరికి వారే యమునా తీరే అంటున్నారు. రాజకీయంగా ఎన్టీఆర్ పార్టీకి ఉన్న సమయంలో ఎన్టీఆర్ ను బాబు ఉపయోగించుకుని ఆతర్వాత వదిలేశారు అన్న విమర్శలు ఉన్నాయి. మరో పక్క ఎన్టీఆర్ కావాలనే పార్టీకి దూరంగా ఉన్నారు అన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇక ఇంకో పక్క ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ నటించడంపై కూడా చాలా చర్చలే జరిగాయి. బాలయ్య అడిగాడో లేదో తెలీదు…లేక ఎన్టీఆర్ కాదన్నాడో లేదో…అసలు బాలయ్య పిలవ లేదో..అసలు ఏం జరిగిందో తెలీదు కానీ…మరో మారు ఎన్టీఆర్ కుటుంభం మధ్య ఉన్న భేదాలు బయటకు పొక్కాయి. ఇక ఇన్ని విమర్శల మధ్య తాజా ఎన్నికలతో ఎన్టీఆర్ కుటుంభంలో ఉన్న దూరం మరొక్కసారి బయట పడుతుందేమో అన్న భయం అభిమానుల్లో నెలకుంది.
ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక, ట్రైలర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ఈ వేడుకను నిమ్మకూరులోని ఎన్టీఆర్ స్వస్థలంలో జరపడానికి సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఈ వేడుకకు ఎన్టీఆర్ ని పిలుస్తారా? ఒకవేళ పిలిస్తే ఎన్టీఆర్ వస్తారా? అన్న భయం అభిమానుల్లో నెలకొంది. మొత్తంగా చూస్తే అసలు ఎవరికి కోపం ఉంది, ఎవరిది మొండి వ్యవహారమో తెలీదు కానీ, అభిమానులు ఆ వంశం అంతా ఒకే వేదికపై కనిపిస్తే చూడాలని అన్నది వారి ఆశ…మరి ఆ ఆశకు వంశం తీరుస్తుందో లేక, మా పంతం మాదే అని ఎవరు తీరులో వారే ఉంటారో చూద్దాం.



