బాలయ్యకు జరిగిందే బన్నీకి జరిగితే పరిస్థితి ఏంటి?

what is the situation for bunny that what happened to balayyaస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మేకర్స్ తమ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు నివేదికలు వస్తున్నాయి. ఆ ప్రకారం సినిమా మొదటి భాగాన్ని అక్టోబర్ 13 న విడుదల చేయాలని వారు యోచిస్తున్నట్లు సమాచారం. ఆ నిర్ణయం తీసుకున్నా మొదటి భాగం పూర్తి చేయడానికి మేకర్స్ ఇంకా 25 రోజుల షూట్ పూర్తి చేయాలి.

మొదటి భాగం ఫహద్ ఫాజిల్ కనిపించడంతో ముగుస్తుందట. బాహుబలి లాగా సుకుమార్ సినిమాను సస్పెన్స్ గా ముగించనున్నారట. ఈ రెండు భాగాలకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటి వరకు తెలుగులో రెండు భాగాలుగా తమ సినిమా ను విడుదల చేసిన హీరోలు ఇద్దరు… ప్రభాస్, బాలకృష్ణ మాత్రమే.

ADVERTISEMENT

ప్రభాస్ రెండు బ్లాక్ బస్టర్స్ సాధించగా, బాలకృష్ణ రెండు డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటూ సస్పెన్స్ పెట్టి రెండో పార్టు మీద ఇంటరెస్ట్ కలిగించాడు రాజమౌళి. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు విఫలమైన తరువాత, ట్రేడ్ గానీ అటు ప్రేక్షకులు ఎన్టీఆర్ మహానాయకుడు పై ఆసక్తి చూపలేదు.

కాబట్టి, పుష్ప బృందం తీసుకున్నఈ నిర్ణయంలో గణనీయమైన ప్రమాదం ఉంది. మొదటి భాగం కనుక ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైతే అసలుకే మోసం జరగొచ్చు. అయితే సుకుమార్ లాంటి లెక్కల మాస్టారు ఇటువంటి లెక్కలు వేసుకోకుండా రంగంలోకి దిగడనే అనుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories