ఈ ఒక్క పాట చాలు… రచ్చ రచ్చ చేస్తుంది..!

What The F Lyrical Geetha Govindam Song‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలకు ముందు ఒక్క ‘అన్ సెన్సార్డ్’ పదంతో విశేషమైన పబ్లిసిటీ కొట్టేసిన విజయ్ దేవరకొండ, ఈ సారి “గీత గోవిందం” సినిమాతో ఓ పాటతో అంతకు మించిన పబ్లిసిటీ కొట్టేలా ఉన్నాడు. స్వయంగా విజయ్ దేవరకొండ ఆలపించిన ఈ సాంగ్ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి.

ADVERTISEMENT

[m9ad]

‘వాట్ ది వాట్ ది ఎఫ్… అమ్మాయి అంటేనే టఫ్ఫూ…’ అంటూ ఊపేస్తోన్న ఈ పాటలో ‘సీత – రాముడు’ మరియు యముడ్ని ఎదిరించి భర్త ప్రాణాలను తెచ్చుకున్న ‘సావిత్రి’ లకు సంబంధించిన లిరిక్స్ వివాదాస్పదంగా ఉండడంతో, ఖచ్చితంగా పబ్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా “గీత గోవిందం” నిలవడం ఖాయమని చెప్పవచ్చు.

‘రాముడు గానీ ఇప్పుడు పుట్టి జంగిల్ కు పోదాం రా రమ్మంటే… సీతకు కాస్త సిరాకు లేచి సోలోగానే పొమ్మంటాదే…’ అని సీతారాముడు గురించి ప్రస్తావించగా, ‘యమపాశంతో యముడే వచ్చి నీ పెనిమిటి ప్రాణం తీస్తానంటే… నెట్ ఫ్లిక్స్ ఈ సావిత్రి, లేట్ ఏంటి అంటూ కుమ్మేస్తాదే’ వంటి లిరిక్స్ ఈ పాటలో వివాదాస్పదంగా మారే అంశాలు.

ఇక కెరీర్ లో తొలిసారిగా ఆలపించిన విజయ్ దేవరకొండ స్వరం ఈ పాటకు సరిపోయింది. ‘అర్జున్ రెడ్డి’ క్యారెక్టర్ నుండి ఇంకా బయటకు రాకుండా ఆ ఒరవడిని కొనసాగించడంలో విజయ్ సక్సెస్ కాగా, శ్రీమణి ఈ పాటకు సాహిత్యం సమకూర్చారు. వినగానే క్యాచీగా ఉన్న ఈ ట్యూన్ ను గోపి సుందర్ స్వరపరిచారు.

ADVERTISEMENT
Latest Stories