తెలంగాణ పవర్ ప్లేలో విన్నర్ ఎవరో?

ఒకప్పటిలాఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు సాదాసీదాగా లేవని అందరికీ తెలుసు. రాజకీయపార్టీల మద్య శతృత్వం ఉన్నట్లు పైకి కనిపిస్తుంటుంది. కానీ తెర వెనక చేతులు కలిపి మరోపార్టీని దెబ్బ తీసేందుకు ఏదో చేస్తుంటాయి.

ADVERTISEMENT

ఇదివరకు కేసీఆర్‌, మోడీ కేంద్ర మంత్రులతో రాసుకుపూసుకు తిరుగుతుండేవారు. ఆ కారణంగా తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలపై ప్రజలకు అపనమ్మకం కలిగేలా చేసి బీజేపీ విశ్వసనీయతను దెబ్బతీసేవారు.

అదే కేసీఆర్‌ ఆ తర్వాత మోడీపై కత్తులు దూయడం మొదలుపెట్టారు. కానీ కూతురు కవిత కోసం బీజేపీతో రాజీపడటం మొదలుపెట్టారు. అందువల్లే శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీ అధిష్టానం బండి సంజయ్‌ని రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించుకొని ఓడిపోయేందుకు కూడా సిద్దపడిందని కాంగ్రెస్‌ వాదనలను కొట్టి పడేయలేము.

ఈ కుమ్మక్కు రాజకీయాలతో కేసీఆర్ అధికారంలోకి రావాలనుకున్నారు. కానీ అదే కారణంగానే ఆయన విశ్వసనీయత దెబ్బ తిని ఎన్నికలలో ఓడిపోయారు.

అయితే తమపై కత్తులు దూస్తున్న కేసీఆర్‌కి బీజేపీ ఎందుకు సాయపడాలనుకుంది? అంటే ఈసారి లోక్‌సభ ఎన్నికలలో తమకు ప్రమాదం పొంచి ఉందని బీజేపీ పెద్దలు ముందే పసిగట్టడం వల్లనే అనుకోవచ్చు.

తెలంగాణలో బీజేపీ అధికారం రాలేనప్పుడు తమ చెప్పు చేతల్లో ఉండే కేసీఆర్‌ మళ్ళీ అధికారంలోకి రాగలిగేలా చేయగలిగితే బిఆర్ఎస్ ఎంపీల మద్దతు లభిస్తుందని బీజేపీ అధిష్టానం భావించి ఉండవచ్చు. కానీ తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది!

ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కేసీఆర్‌ తన పార్టీని తానే బలి చేసుకుని బీజేపీ 8 సీట్లు గెలుచుకునేలాచేశారని సిఎం రేవంత్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. రెండున్నర దశాబ్ధాలు తెలంగాణ రాజకీయాలనుశాసించిన కేసీఆర్‌కు లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు గెలవలేకపోవడం ఏమిటి?అని రేవంత్‌ రెడ్డి ప్రశ్న ఆలోచింపజేస్తుంది.

కూతురు కవితని జైలు నుంచి విడిపించుకోవడానికి, పనిలో పనిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడకుండా అడ్డుకునేందుకే కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలలో తన పార్టీని బలి చేసుకున్నారని రేవంత్‌ రెడ్డి వాదనలను కొట్టి పడేయలేము.

నేటికీ కేసీఆర్‌ బీజేపీ సాయంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేద్దామని ఆశ పడుతున్నారు. కానీ కేసీఆర్‌కు సాయపడితే తమ విశ్వసనీయత దెబ్బ తింటుందని బీజేపీ ఆలోచిస్తోంది. కానీ విశ్వసనీయత కంటే అధికారం చాలా ముఖ్యం!

కనుక ఏదో రోజున రెండు పార్టీలు కలిసి తన ప్రభుత్వాన్నికూల్చేస్తాయని సిఎం రేవంత్‌ రెడ్డికి కూడా తెలుసు. అందుకే ఓ వైపు మోడీని మంచి చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు బిఆర్ఎస్‌ని ఖాళీ చేసేస్తున్నారు. ఈవిదంగా తెలంగాణలో మూడు పార్టీలు ఒక దానిని మరొకటి మోసం చేసుకుంటూ ఆడుతున్న ఈ ‘పవర్ ప్లే’లో ఎవరో ఒకరు బలికాక తప్పదు. అది ఎవరో రాబోయే రోజుల్లో చూడవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Rajamouli’s Unfinished Epic Dream: Can Varanasi Deliver?

SS Rajamouli has conquered box-office records with larger-than-life storytelling. But there is one thing that…

13 minutes ago

Jungle Adventure: Yash Chooses Disaster Director Again?

Following the terrible failure of Toxic, Yash has still not announced his next solo lead…

43 minutes ago