
పార్టీ ఫిరాయింపు నేతల మీద అనర్హత వేటు వేయించడంలో ఉన్న శ్రద్ద బిఆర్ఎస్ కి తన పార్టీకి రాజీనామా చేసిన నేతల రాజీనామాలను ఆమోదించడం మీద ఉండదా.? కడియం కేసీఆర్ కి వెన్నుపోటు పొడిచాడు, దానం పార్టీ కి అన్యాయం చేసాడు, అరికపూడి గాంధీ పార్టీ లైన్ దాటాడు,
పోచారం శ్రీనివాస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేసాడు, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, తెల్లం వెంకటరావు, ప్రకాష్ గౌడ్ ఇలా బిఆర్ఎస్ కారు దిగిన నేతలందరినీ ప్రజా తీర్పుని గౌరవించలేని నేతలుగా ప్రకటిస్తూ వారి పై అనర్హత వేటు వెయ్యాల్సిందే అంటూ స్పీకర్ ని పట్టుబట్టడంతో పాటుగా న్యాయస్థానాలను ఆశ్రయించింది బిఆర్ఎస్ అధిష్టానం.
అలాగే పార్టీ ఫిరాయింపు నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించేది లేదని, అటువంటి అవకాశవాద రాజకీయ నాయకులకు కేసీఆర్ గులాబీ కారులో స్తానం ఉండదు అంటూ బహిరంగ హెచ్చరికలు పంపుతున్న బిఆర్ఎస్ అధినాయకత్వం బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత రాజీనామాను ఇంతకాలం అయినా ఎందుకు ఆమోదించలేదు.?
ఇప్పటికి అధికారికంగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ గానే కవిత చెలామణి కావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.? దీనికి కారణం ఏంటి.? ఎవరు.? అంటూ కవిత బిఆర్ఎస్ ని సూటిగా ప్రశ్నిస్తుంది. బిఆర్ఎస్ తన రాజీనామా మీద ఇప్పటికి ఆమోద ముద్ర వేయకపోవడంతో తానూ శాసన మండలి సమావేశాలకు వెళ్లాలా.? ఒకవేళ వెళితే ఏ పార్టీ నేతగా సభకు హాజరు కావాలి అంటూ కవిత సంధిస్తున్న ప్రశ్నలకు బిఆర్ఎస్ బదులు చెప్పగలదా.?
అలాగే తన రాజీనామాను ఆమోదించండి అంటూ కవిత పోరాటాలు చెయ్యడానికి సిద్ధపడేలా పరిస్థితిని ఎందుకు తెస్తుంది బిఆర్ఎస్.? కవిత సస్పెన్షన్ మీద వెనక్కి తగ్గని బిఆర్ఎస్ కవిత రాజీనామా మీద ఎందుకు ముందుకు వెళ్లలేకపోతుంది.?
విశాఖ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ…
Andhra Pradesh politics got largely streamlined after the removal of YCP from power. Usually abusive…