కొత్త ఏడాది..కొత్త లక్ష్యాలు డైరీల కేనా.?

New Year Resolutions

కొత్త ఏడాది కొత్త లక్ష్యాలు అంటూ చాలామంది వయసుతో సంబంధం లేకుండా ఈ ఏడాది తమ లక్ష్యాలన్నీ కూడా ఒక డైరీలో పొందుపరుస్తుంటారు. ముఖ్యంగా ఈ కొత్త ఏడాది లక్ష్యాలలో ప్రముఖంగా వినిపించే పేరు జిమ్.

* జిమ్: ఈ ఏడాది నుంచి ప్రతి రోజు ఒక గంట సేపు జిమ్ కి కేటాయిస్తా అంటూ అనేకమంది జాన్ -1 కి శపధాలు కూడా చేస్తుంటారు. అయితే ఇందులో ఫిట్నెస్ కోసం కొందరు, బాడీ బిల్డింగ్ కోసం మరికొందరు, వెయిట్ లాస్ కోసం మరికొందరు జిమ్ కోసం ఏళ్ళ పాటు లక్ష్యాలను డైరీలో అయితే నమోదు చేస్తారు కానీ డైలీ లైఫ్ లో మాత్రం అందుకు సమయం కేటాయించరు, కేటాయించలేరు కూడా.

ADVERTISEMENT

* స్టడీస్: ఇక ఆ తరువాత స్థానంలో విద్యార్థులు ఉంటారు. ఈ ఏడాది తాము సాధించాల్సిన లక్ష్యాలు, ఎంచుకున్న గోల్స్ అంటూ ఒక బాహుబలి రేంజ్ టైం టేబుల్ అయితే డిజైన్ చేస్తారు కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి మాత్రం ఎంతో ఆలోచిస్తుంటారు. అలాగే ఆ ఆలోచనలోనే వారు మరో క్యాలెండర్ ఇయర్ లోకి కూడా వచ్చేస్తుంటారు కూడా.

* జంక్ ఫుడ్: ఇక పిల్లలు, యువత ఈ ఏడాది నుంచి జంక్ ఫుడ్ మానేస్తా, లేదా పరిమితం చేస్తా, బయట ఫుడ్ ని అవసరానికి మించి వాడను అంటూ తమ తమ డైరీలలో పేజీలకు పేజీలు రాస్తుంటారు. కానీ ఒక బర్గర్, ఒక పిజ్జా కనిపిస్తే ఆ ఒట్టులన్నీ గట్టున పెట్టేసి ఇప్పుడు కాదు దీనికి ఇంకా సమయం ఉంది అంటూ ఆ లక్ష్యాలను మరో ఏడాదికి పోస్ట్ పోన్ చేస్తుంటారు.

* స్మోకింగ్ & డ్రింకింగ్: అలాగే కొంతమంది ఖాతాలో స్మోకింగ్ ఈజ్ ఇంజురియాస్ టూ థిస్ ఇయర్, అంటూ ధూమపానాన్ని నా లైఫ్ నుంచి నా కుటుంబం నుంచి దూరం చేస్తానంటూ ప్రామిస్ లు చేస్తూ వాటిని కంట్రోల్ చేసుకోలేక చేతులు కాల్చుకుంటారు. అలాగే మందుబాబులు సైతం ఇక నుంచి లిక్కర్ కి దూరం అంటూ కబుర్లు చెపుతారు, 90 కనపడితే చాలు కంట్రోల్ తప్పుతుంటారు.

ఇలా కొత్త ఏడాది కొత్త లక్ష్యాలు అంటూ ఎవరికి వారు వారి డైరీలలో పేజీలనైతే నింపుతారు కానీ వాటిని డైలీ లైఫ్ లో అమలు చేసే విషయానికొస్తే సద్దుబాట్లతో బుజ్జగిస్తారే తప్ప అందుకు సిద్ధంగా ఉండే వారి శాతం చాల తక్కువనే చెప్పాలి.

మరి ఈ కొత్త ఏడాది మీరు మీ కొత్త లక్ష్య సాధన వైపు అడుగులేస్తున్నారా.? లేక వాయిదా పద్ధతుంది దేనికైనా అంటూ మరో ఏడాది కోసం నిరీక్షిస్తున్నారా.?

ADVERTISEMENT
Latest Stories